ఆగస్టు 4 ఆదివారం రోజున ఆషాడ అమావాస్య అని పిలుస్తారు. హిందూ మత గ్రంధాల ప్రకారం ఆషాడ అమావాస్య రోజు పితృతర్పణాలు చేస్తారు. దీనివల్ల వారి ఆత్మలు శాంతి చేకూరుతాయని భావిస్తారు.
న్యూస్ లైన్ డెస్క్: ఆగస్టు 4 ఆదివారం రోజున ఆషాడ అమావాస్య అని పిలుస్తారు. హిందూ మత గ్రంధాల ప్రకారం ఆషాడ అమావాస్య రోజు పితృతర్పణాలు చేస్తారు. దీనివల్ల వారి ఆత్మలు శాంతి చేకూరుతాయని భావిస్తారు. ఈరోజు ఆషాడ అమావాస్య ఘడియలు 3.54ని" వరకు ఉన్నాయి. ఈరోజు పవిత్ర నదుల్లో స్నానం చేయాలి. అలాగే పితృ తర్పణాలు చేసి అర్హులైన బ్రాహ్మణులకు దానధర్మాలు చేయాలి.
ముఖ్యంగా పేదలకు అభాగ్యులకు వస్త్రాలు ఆహారం దానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా జాతకంలో పితృ దోషం ఉండేవారు ఈరోజు ఆలయాలకు వెళ్లి భగవంతున్ని నమస్కరించి ఆలయ పరిసరాలలోని పూల చెట్ల కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆషాడ అమావాస్య రోజు ఇంట్లో దేవుని మందిరం దగ్గర ఎర్రని వస్త్రాన్ని పరిచి దానిపై శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేయాలి.
ఈ అమావాస్య రోజు నూతన వస్త్రాలు చెప్పులు ఇలా నూతన వస్తువులు ఏవైనా సరే కొనుగోలు చేయవద్దు. అలాగే వస్తువుతో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేయరాదు. అలాగే నూతన వ్యాపారం ఉద్యోగం పెట్టుబడులు కూడా పెట్టరాదు. ఆషాడ మాసం రోజు ముఖ్యంగా దేవుడి ఆరాధన చేసుకొని పేద ప్రజలకు దానధర్మాలు చేస్తే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారని పండిత నిపుణులు అంటున్నారు.