ఇదొక ఫాల్స్ కేసు..
సర్కారు కుట్రతో కేసులు పెడుతోంది
దాడి చేశారు.. కేసులు పెట్టారు
ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
నిజాలు త్వరలోనే బయటకొస్తాయి
కోర్టు దగ్గర మీడియాతో జర్నలిస్ట్ శంకర్
తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 29) : తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని జర్నలిస్ట్ శంకర్ ఆరోపించారు. సర్కారు కుట్ర పూరితంగా అక్రమ కేసు పెట్టించిందని అన్నారు. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయిస్తున్నారని చెప్పారు. ఎన్ని చేసినా ప్రశ్నించడంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. శనివారం నాంపల్లి కోర్టు దగ్గర ఆయన మాట్లాడారు. గతంలోనూ తనపై దాడులు చేశారని, కేసులు పెట్టారని ఇప్పుడు ఎన్ని కుట్రలు చేసినా ప్రశ్నించడంలో వెనక్కితగ్గేదిలేదని చెప్పారు. ఇది ఫాల్స్ కేసు అని.. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని అన్నారు.