చాలామంది ఆడవారు వారి యొక్క శరీరాకృతిని కాపాడుకోవడం కోసం తప్పకుండా లోదుస్తులను ధరిస్తూ ఉంటారు. ఈ లోదుస్తుల్లో శరీరాకృతిని కప్పి ఉంచే అత్యంత అవసరమైన లో దుస్తువు బ్రా.
న్యూస్ లైన్ డెస్క్: చాలామంది ఆడవారు వారి యొక్క శరీరాకృతిని కాపాడుకోవడం కోసం తప్పకుండా లోదుస్తులను ధరిస్తూ ఉంటారు. ఈ లోదుస్తుల్లో శరీరాకృతిని కప్పి ఉంచే అత్యంత అవసరమైన లో దుస్తువు బ్రా. దీన్ని చాలా మంది స్త్రీలు ఉపయోగిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఈ లోదూస్తువుల్లో అనేక రకాల డిజైన్లు వచ్చాయి. వీటన్నింటిని చాలామంది యువతులు ధరిస్తూ వారి శరీరాకృతిని కాపాడుకుంటున్నారు. మరి నిజంగానే బ్రా దరించడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందా.. దానివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా..మూడు నెలలపాటు ఈ లో దుస్తులు వాడకపోతే జరిగేదేంటి అనే వివరాలు చూద్దాం..
నొప్పి:
ఈ లో దుస్తులు అనేవి మహిళల యొక్క బ్రెస్ట్ భాగాన్ని పదిలంగా ఉంచుతాయి. అలాంటి లోదుస్తులు ధరించకుండా వ్యాయామం చేసినా, జిమ్ముకు వెళ్లిన తప్పకుండా బెస్ట్ నొప్పి వస్తుందట.
ఆనందం:
గర్ల్స్ తరచు లో దుస్తులు ధరించడం వల్ల వారి యొక్క బెస్ట్ భాగంలో చాలా అసౌకర్యంగా ఉంటుందట. ఒక మూడు నెలల పాటు అది ధరించకపోతే కాస్త ఉపశమనం పొందుతారట
మెడ నొప్పి :
ముఖ్యంగా బరువైనటువంటి బ్రెస్ట్ కలిగిన వారు మూడు నెలలపాటు బ్రా దరించకపోవడం వల్ల తప్పక మెడనొప్పి, భుజాలపై నొప్పి వస్తుందట.
శరీరాకృతి:
లో దుస్తులు ధరించడం వల్ల మీ యొక్క శరీరం అనేది నిటారుగా ఉంటుందట. అదే టైంలో మీరు రెండు నుంచి మూడు నెలల పాటు ఇది ధరించకపోతే మీ శరీర భంగిమ మారిపోతుందని అంటున్నారు.
రక్తప్రసరణ:
కొంతమంది ఎంతో బిగుతుగా ఉండే లో దుస్తులు ధరిస్తారు. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగా ఉండదు. ఒక రెండు నెలల నుంచి మూడు నెలల పాటు ఇది ధరించకపోతే రక్త ప్రసరణ హ్యాపీగా జరిగి నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారట.