పూర్వకాలంలో ఎక్కువగా ఇంగ్లీష్ మందులు ఉండేవి కావు. దీంతో చాలామంది ఊర్లలోనే వివిధ రకాల ఆకులతో ఎలాంటి రోగాలు అయినా నయం చేసేవారు. ముఖ్యంగా మన ఇంటి పరిసరాల్లో ఎన్నో మొక్కలు మనకు
న్యూస్ లైన్ డెస్క్: పూర్వకాలంలో ఎక్కువగా ఇంగ్లీష్ మందులు ఉండేవి కావు. దీంతో చాలామంది ఊర్లలోనే వివిధ రకాల ఆకులతో ఎలాంటి రోగాలు అయినా నయం చేసేవారు. ముఖ్యంగా మన ఇంటి పరిసరాల్లో ఎన్నో మొక్కలు మనకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తూ ఉంటాయి. కానీ మనం వాటిని పట్టించుకోకుండా ఇంగ్లీష్ మందులనే వాడుతూ ఉంటాం. చిన్న చిన్న సమస్యలకు కూడా టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాం.
అలాకాకుండా కొన్ని మొక్కలు కొన్ని కొన్ని చిన్న చిన్న రోగాలను తగ్గిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉత్తరేణి మొక్క.. ఈ మొక్క వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు క్లియర్ అవుతాయట. ఆ వివరాలు ఏంటో చూద్దాం..సాధారణంగా మన ఇంటి పెరట్లో ఉండే ఈ ఉత్తరేణి మొక్కలను మనకు కనిపిస్తే పీకి పడేస్తాం..కానీ ఈ మొక్కల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అదేంటో తెలిస్తే మీరు ఈ మొక్కను అస్సలు పీకేయరు. అదేంటో చూద్దామా..
ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన ఈ ఉత్తరేణి చెట్టు వల్ల ఫైల్స్ మాయమవుతాయట. అయితే ఈ చెట్టు యొక్క గింజలను పూర్తిగా ఎండబెట్టి, దంచి పొడి చేసుకుని, రెండవసారి బియ్యం కడుగుతున్న నీళ్లను గ్లాసులో పోసుకొని మూడు గ్రాముల పొడి అందులో కలుపుకొని తాగితే అర్షమొలలు పూర్తిగా నయమవుతాయట. అంతేకాకుండా ఫెరాలసిస్ వచ్చి బ్లడ్ క్లాట్ అయినవారు ఈ ఉత్తరేణి ఆకులను మెత్తగా నూరి, చిన్న చిన్న ఉండలు చేసి వాటిని తిన్నట్లయితే క్లాట్ ఈజీగా క్లియర్ అవుతుందట.
అలాగే ఉత్తరేణి వేర్లతో పళ్ళు తోముకున్నట్లయితే మన దంతాలు చిగుర్లు ఎంతో ఆరోగ్యంగా గట్టిగా తయారవుతాయట. ఈ చెట్టు ఆకుల రసాన్ని తీసి తాగినట్లయితే కిడ్నీల్లో రాళ్లు ఎలాంటి సమస్యలు లేకుండా మాయమైపోతాయట. అలాగే తేనెటీగలు, తేళ్ళు వంటివి కరిచినప్పుడు ఈ చెట్టు ఆకులను దంచి మనకు ఎక్కడైతే అవి కుట్టాయో ఆ ప్లేస్ లో అంటిస్తే మనకు ఆ విషం అనేది ఎక్కువగా స్ప్రెడ్ కాదట. అలాగే దురద ఉన్నవారు కూడా ఈ ఆకులను ముద్దగా నూరి ఎక్కడైతే దురద పెడుతుందో అక్కడ రాసుకుంటే పూర్తిగా నయం అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.