శ్రీవారు ఎర్రట పూలమాలలు ధరించి భక్తులకు అభయ ప్రధానం చేశారు. సూర్యుడు సకలరోగ నివారకుడు , ఆరోగ్యకారకుడు , ఈ వాహన దర్శనం స్వామి వారు భక్త జనానికి సకల రోగాలు నివారణ కలిగిస్తాడని భక్తుల నమ్మకం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమలలోని శ్రీవారి బ్రహ్మాత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. స్వామి వారు రోజుకో వాహనం పై తిరుమాడ వీధుల్లో భక్త జనానికి దర్శనమిస్తున్నారు. గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీవారు ఎర్రట పూలమాలలు ధరించి భక్తులకు అభయ ప్రధానం చేశారు. సూర్యుడు సకలరోగ నివారకుడు , ఆరోగ్యకారకుడు , ఈ వాహన దర్శనం స్వామి వారు భక్త జనానికి సకల రోగాలు నివారణ కలిగిస్తాడని భక్తుల నమ్మకం.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం, రాత్రి వేళల్లో మలయప్పస్వామి పలు రకాల వాహనాలపై వివిధ రకాల వేషధారణలో భక్తులకు దర్శనమిస్తున్నారు . 6వ రోజు బుధవారం మలయప్పస్వామి స్వర్ణరథం, గజ వాహనాలపై పయనించి భక్తులను కటాక్షించారు. మహిళలు నిన్న జరిగిన స్వర్ణ రథోత్సవంలో భారీగా పాల్గొన్నారు. స్వామి వారి రథాన్ని మహిళలే లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ కలుగుతాయని భక్తుల నమ్మకం. భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు కలిగి సిరిసంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. జై శ్రీమన్నారాయణ.