GOLD: భారీగా తగ్గుతున్న బంగారం ధర ..వెండి ధర ఎంతంటే ?

ట్రంప్‌ గెలుపుతో ప్రపంచ మార్కెట్‌ ప్రభావితమవుతోంది. అప్పటిదాకా ముట్టుకోలేరన్నట్లు మురిపించిన బంగారం ధర.. నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.


Published Nov 13, 2024 09:56:00 PM
postImages/2024-11-13/1731515284_goldprice21713248743.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఇది నిజంగా మిడిల్ క్లాస్ , లోవర్ మిడిల్ క్లాస్ వాళ్లకి గుడ్ న్యూసే. లక్ష దాటిపోతుంది...లక్ష చేరిపోతుందనుకున్న బంగారం ధర తగ్గి 70450 రూపాయిలుగా ఉంటే ఎవరికైనా హ్యాపీనే కదా. కార్తీకమాసంలో, పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి రేటు టెంప్ట్‌ చేస్తుంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 76వేల 850 రూపాయలకు దిగొచ్చింది. 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు 70వేల 450 రూపాయలకు తగ్గింది. నాలుగు రోజుల్లో బంగార 3 వేల రూపాయిలు తగ్గింది. 


ట్రంప్‌ గెలుపుతో ప్రపంచ మార్కెట్‌ ప్రభావితమవుతోంది. అప్పటిదాకా ముట్టుకోలేరన్నట్లు మురిపించిన బంగారం ధర.. నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఇన్వెస్టర్లు బంగారంనుంచి తమ పెట్టుబడులను స్టాక్‌మార్కెట్‌తో పాటు ఇతర పెట్టుబడులకు మళ్లిస్తుండటం కూడా గోల్డ్‌ రేట్స్‌ డౌన్‌ఫాల్‌కి మరో ముఖ్యకారణం.  అంతేకాదు బులియన్ మార్కెట్ బేరమంటూ నష్టాలు చూస్తుంది.


నిజానికి పెళ్లిళ్లు ...ఆడపిల్లలు శుభకార్యాల కోసం టెన్షన్ పడే వారికి ఈ మార్పు చాలా హ్యాపీ అయిపోతారు. పది గ్రాముల బంగారం ధర 60 వేలదాకా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. బంగారం మెల్లగా ధర తగ్గిపోతుందని కూడా అంటున్నారు. ఈఏడాది అక్టోబర్‌ 30న 80వేల 450 రూపాయల ఆల్‌ టైమ్‌ హై రేట్‌ని టచ్‌ చేసింది గోల్డ్. ఈ ఏడాదిలో 35సార్లు ఆల్‌ టైమ్‌ హైతో.. ఓవరాల్‌గా 33 శాతం పెరుగుదలని నమోదుచేసింది. 

newsline-whatsapp-channel
Tags : business gold-rates silver-rate stock-market

Related Articles