Gold Price: మరలా ధర పెరుగుతున్న పసిడి...ఇప్పుడు ధర ఎంతంటే !

తగ్గుతున్నట్టే తగ్గి మరోసారి 70 వేలు దాటింది బంగారం . గత వారం భారీగా తగ్గిన బంగారం ...ఈ వారం తిరిగి పుంజుకొంటుంది


Published Nov 21, 2024 01:05:00 PM
postImages/2024-11-21/1732174552_113898003.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  దేశంలో బంగారం ధర మరోసారి పెరుగుతున్నాయి. గురువారం బంగారం ధర 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 330 పెరిగింది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 2300 పెరిగింది. తగ్గుతున్నట్టే తగ్గి మరోసారి 70 వేలు దాటింది బంగారం . గత వారం భారీగా తగ్గిన బంగారం ...ఈ వారం తిరిగి పుంజుకొంటుంది.దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు గ్రాము ధర ఎలా ఉందో చూసేద్దాం.


హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,150కు చేరింది. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.77,950 వద్ద కొనసాగుతుంది.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,600 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 78,100.


కలకత్తా, ముంబై లో 22 క్యారట్ల 10 గ్రాముల గోల్డ్ ధర కూడా ఇదే నడుస్తుంది. 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 77,950.. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లోను బంగారం ధర ఇదే నడుస్తుంది.


చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,01,000. ముంబై , ఢిల్లీ , కోలకత్తాలో మాత్రం 92 వేలు నడుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business gold-rates silver-rate stock-market

Related Articles