TTD : ఆగష్టులో శ్రీవారికి జరిగే విశేష సేవలివే.. మిస్ అవకండి

ఆగష్టు నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు, శ్రీవారికి జరిగే విశేష సేవల జాబితాను విడుదల చేసింది.


Published Jul 31, 2024 09:24:16 AM
postImages/2024-07-31/1722432793_ttd.jpg

న్యూస్ లైన్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు భక్తుల కోసం కీలక ప్రకటన చేసింది. ఆగష్టు నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు, శ్రీవారికి జరిగే విశేష సేవల జాబితాను విడుదల చేసింది. ఈ నెలలో గరుడ పంచమి వేడుకల, పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.

ఆగస్టులో జరిగే ఉత్సవాల వివరాలు

ఆగష్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం
ఆగష్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు
ఆగష్టు 9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ

ఆగష్టు 10న కల్కి జయంతి
ఆగష్టు 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి
ఆగష్టు 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
ఆగష్టు 15న భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం. స్మార్త ఏకాదశి
ఆగష్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
ఆగష్టు 16న వరలక్ష్మీ వ్రతం,  నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం
ఆగష్టు 19న శ్రావణ పౌర్ణమి. పౌర్ణమి గరుడ సేవ. రాఖీ పండుగ. హయగ్రీవ జయంతి. విఖ‌న‌స మ‌హాముని జ‌యంతి
ఆగష్టు 20న తిరుమల శ్రీవారు విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు. గాయత్రీ జపం
ఆగష్టు 27న శ్రీ‌కృష్ణాష్టమి, తిరుమ‌ల శ్రీ‌వారి ఆస్థానం
ఆగష్టు 28న శ్రీ‌వారి శిక్యోత్సవం

newsline-whatsapp-channel
Tags : telangana andhrapradesh tirupati latest-news news-updates telugu-news devotional

Related Articles