న్యూస్ లైన్ డెస్క్ : ఆస్తుల వివరాలు ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తుల వివరాలు చెప్పని దాదాపు 2.5 లక్షల ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది. ఆన్ లైన్ లో ప్రభుత్వానికి ప్రతి ఉద్యోగి ప్రాపర్టీ వివరాలు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాదేశాల మేరకు కొందరు ఉద్యోగులు తమ ఆస్తి వివరాలను పొందు పరిచారు. కాగా.. 2 లక్షల 44 వేల 565మంది ఉద్యోగులు ఆస్తి వివరాలను ప్రభుత్వానికి అందించలేదు. దీంతో.. యోగీ సర్కార్ ఆ ఉద్యోగులకు ఆగష్టు నెల జీతాలను నిలిపివేసింది. అన్ని శాఖలు ఇచ్చిన రిపోర్టులను బట్టి ఆగస్టు నెల జీతాన్ని ప్రభుత్వం హోల్డ్ లో పెట్టినట్టు ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రాపర్టీ డీటెయిల్స్ వెల్లడించేందుకు యూపీ సర్కార్ మానవ్ సంపద పోర్టల్ ను ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్ లో ఉద్యోగులందరూ ఆగష్టు 31 వరకు ఆస్తి వివరాలు తెలుపాలని ఆదేశించింది. అయితే.. 29 శాతం మంది ఉద్యోగులు తమ ఆస్తి వివరాలను నమోదు చేయలేదు. ఆస్తి వివరాలు నమోదు చేయని వారిలో ఐఏఎస్, ఐపీఎస్, పీపీఎష్ , పీసీఎస్ వంటి అగ్రశ్రేణి ఉద్యోగులు ఉన్నారు. అయితే.. టీచర్లు, కార్పోరేషన్, అటానమస్ సంస్థల ఉద్యోగులకు ఈ నిబంధన వర్తించదు.