నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాద కార్యకలాపాలతోపాటు సైనిక ఘర్షణలు జరిగే అవకాశముందని హెచ్చరించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాకిస్థాన్ లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువైంది. ఉన్నట్టుండి దాడులు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు అమెరికా అధికారులు. పాకిస్థాన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటే భారత సరిహద్దు ప్రాంతాలకు, బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ లకు అస్సలు వెళ్లొద్దని హెచ్చరించింది. ఆయా ప్రావిన్స్ లలో ఎప్పుడు ఎక్కడ ఉగ్రదాడులు జరిగే అవకాశాం ఉందనేది చెప్పలేమనిపౌరులకు తెలిపింది. నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాద కార్యకలాపాలతోపాటు సైనిక ఘర్షణలు జరిగే అవకాశముందని హెచ్చరించింది.
మార్కెట్లు , రవాణా కేంద్రాలు అంతే కాదు చాలా ఏరియాల్లో పౌరులను పోలీసులను సైనికులను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఈ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఇందులో లైన్ ఆఫ్ కంట్రోల్ ఏరియాకు అస్సలు ప్రయాణించవద్దని లెవెల్ 4 హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దుల్లో మిలిటెంట్ గ్రూపులు దాడులు చెయ్యొచ్చని సరిహద్దులకు రెండు వైపులా రెండు దేశాలు భారీ స్థాయిలో బలగాలను మోహరించాయని వివరించింది. పాక్ నుంచి భారత్ లో అడుగు పెట్టేందుకు ఉన్న ఏకైక అధికారిక మార్గం వాఘా బార్డర్ మాత్రమేనని సరిహద్దులు వాఘా బార్డర్ మాత్రమేనని, సరిహద్దులు దాటి భారత్ లో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి అని పేర్కొంది. కాని పాకిస్థాన్ వెళ్లకపోవడమే మందని ట్రావెల్ అడ్వైజరీ తెలిపింది.