నిందితుడు శివాజీ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడని.. అందుకే పోలీసులు అతడిని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్ : నగరంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గ్యాంగ్ రేప్ ఘటనలో ఇప్పటికే పోలీసులు గౌతమ్ రెడ్డి అనే యువకుడిని అరెస్ట్ చేశారు. కాగా.. మరో నిందితుడు శివాజీ రెడ్డి పరారీలో ఉన్నాడు. శివాజీ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడని.. అందుకే పోలీసులు అతడిని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చిందన్న ఆనందంలో చిన్నానాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డికి పార్టీ ఇచ్చిందుకు పిలిచింది బాధితురాలు. అతడితో పాటు వచ్చిన మరో ఇద్దరిలో శివాజీ ఒకరు. బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ లో పార్టీ చేసుకున్న సమయంలో శివాజీ బాధితురాలికి మద్యం తాగించాడు. అనంతరం బార్ లోని ఓ గదిలోకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.