చాలా కాలంగా తనకు పరిచయం ఉన్న రాబర్ట్ అనే కొరియోగ్రాఫర్ తో ఏడడుగులు వేయబోతున్నట్లు ప్రకటించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీ లో ఒకప్పటి అందాల తార మంజుల కూతురు వనిత గురించి అందరికి తెలుసు. దేవి హీరోయిన్ గా కంటే గొడవల వల్లే ఎక్కువ తెలుసు. ఇప్పటి కి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి.తెలుగు ఇండస్ట్రీ లో ఒకప్పటి అందాల తార మంజుల కూతురు వనితా విజయ్ కుమార్. ఫ్యామిలీ తో కలిసిలేదు. అయితే అమ్మడుకు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు నాలుగో పెళ్లికి రెడీ అవుతుందంంటున్నారు.చాలా కాలంగా తనకు పరిచయం ఉన్న రాబర్ట్ అనే కొరియోగ్రాఫర్ తో ఏడడుగులు వేయబోతున్నట్లు ప్రకటించింది.
నిజానికి 1995 లో ‘చంద్రలేఖ’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వనిత సినిమాల్లో కన్నా వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది . 2000లో నటుడు ఆకాశ్ ని పెళ్లి చేసుకుంది.. వీరికి కొడుకు, కూతురు పుట్టిన తర్వాత మనస్పర్ధలతో 2005లో విడాకులు తీసుకుంది. తర్వాత రెండో పెళ్లి చేసుకుంది 2020 లో పీటర్ పాల్ ను అనే వ్యక్తిని మూడో పెళ్లి కూడా చేసుకుంది. జస్ట్ నాలుగు నెలల్లో బ్రేకప్ కూడా అయ్యింది. పెళ్లి కాలేదు జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యిందన వనిత చెప్పినా..జనాలు పెద్ద వినలేదు.
ఇప్పుడు కొంత కాలంగా రాబర్డ్ అనే కొరియోగ్రాఫర్ తో ఈ 43 ఏళ్ల భామ రిలేషన్ షిప్ కొనసాగిస్తూ వచ్చింది. రాబర్ట్ మాస్టర్ కి ఆమె బీచ్ లో బికినీలో మోకరిల్లి ప్రపోజ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్టోబర్ 5న పెళ్లి జరగనుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇప్పుడు వనిత కెరియర్ కూడా మంచి స్పీడులో ఉంది. ఇది నిజంగా పెళ్లా లేక ...మూవీ అప్ డేటా తెలీదు కాని పెళ్లి అని మాత్రం ట్వీట్ చేసింది.