తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ హీరోలతో నటించాలంటేనే హీరోయిన్స్ ఎంతో అదృష్టంగా భావిస్తారు. అలాంటి ఫ్యామిలీకి కోడలిగా వెళితే
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ హీరోలతో నటించాలంటేనే హీరోయిన్స్ ఎంతో అదృష్టంగా భావిస్తారు. అలాంటి ఫ్యామిలీకి కోడలిగా వెళితే వారి అదృష్టం ఏ విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆ అదృష్టాన్ని దక్కించుకుంది స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. వరుణ్ తేజ్ తో ప్రేమలో పడి కొన్నాళ్లపాటు సీక్రెట్ గా ప్రేమ నడిపించి పెద్దలను ఒప్పించి చివరికి వివాహం ద్వారా ఒకటయ్యారు. వీరి పెళ్లిని ఇటలీలో అంగరంగ వైభవంగా దగ్గర కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు.
అలాంటి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించి మరోసారి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా తెలుగు సాంప్రదాయం ప్రకారం ఇంట్లో అబ్బాయి పెళ్లి జరిగితే ఆడపడచుకు ఎంతో కొంత కట్నం సమర్పిస్తారు. ఆ విధంగానే వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లికి నిహారికకు ఎంత ఆడపడుచు కట్నం ఇచ్చారు అనేది ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఒక ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠిని యాంకర్ మీ పెళ్లి సమయంలో నిహారికకు ఎంత ఆడపడుచు కట్నం ఇచ్చారు అని ప్రశ్నించారు.
దీంతో లావణ్య త్రిపాఠి ఆడపడుచు కట్టమంటే ఏంటి అని ప్రశ్నించింది. అలాంటిది ఏమీ ఇవ్వలేదని చెప్పింది. మీరు ఆడపడుచు కట్నం ఇవ్వలేదు కాబట్టి ఆమె చేసే వెబ్ సిరీస్ లో మీరు ఫ్రీగా నటించండి అంటూ ఆ యాంకర్ అన్నాడు. దీంతో లావణ్య త్రిపాఠి మా ఫ్యామిలియే కదా అంటూ నవ్వుతూ చెప్పింది. ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ 2017లో మిస్టర్ అనే సినిమా నుంచి దగ్గరయ్యారు. అప్పటినుంచి వీరి ప్రేమ నడిపిస్తూ చివరికి పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు.