Veena Srivani: అదృష్టం అంటే వేణు స్వామి భార్యదే.. మామూలు టాలెంట్ కాదు.!

వేణు స్వామి  రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఎంతో గుర్తింపు పొందినటువంటి జ్యోతిష్కుడు. అలాంటి వేణుస్వామి సినీ రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. అలాంటి వేణు స్వామి  కంటే తన భార్య మహా టాలెంటెడ్. ఆయన సతీమణి పేరు వీణ శ్రీవాణి. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  కారణం ఏంటంటే వేణు స్వామి సతీమణి వీణ శ్రీవాణి ముకేశ్ అంబానీ రెండవ కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకకు హాజరైంది. అంతేకాదు ఆమెకు ప్రత్యేకంగా ఆహ్వానం అందించారట.  ప్రధాన కారణం ఆమె వీణ వాయించడంలో మంచి పేరు తెచ్చుకుంది కాబట్టి ఆమె ప్రదర్శన కోసం  స్పెషల్ గా ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది. అయితే వివాహ వేడుకలో ఈమె వీణ ప్రదర్శన హైలెట్  గా నిలిచినట్లు సమాచారం. ప్రపంచంలోని ఎంతోమంది ప్రముఖులు హాజరైన వివాహ వేడుకలో చాలామంది ఈమె వీణ వాయిస్తుంటే కన్నర్పకుండ తిలకించారట.


Published Jul 16, 2024 05:00:00 PM
postImages/2024-07-16/1721127399_veena.jpg

న్యూస్ లైన్ డెస్క్: వేణు స్వామి  రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఎంతో గుర్తింపు పొందినటువంటి జ్యోతిష్కుడు. అలాంటి వేణుస్వామి సినీ రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు.  ఈ మధ్యకాలంలో ఆయన చెప్పిన కొన్ని జాతకాలు బేడిసి కొట్టడంతో కాస్త సైలెంట్ అయిపోయారు కానీ మొన్నటి వరకు హీరోలకు, హీరోయిన్లకు పూజలు చేస్తూ  క్రేజ్ లో దూసుకుపోయారు. అలాంటి వేణు స్వామి  కంటే తన భార్య మహా టాలెంటెడ్. ఆయన సతీమణి పేరు వీణ శ్రీవాణి.

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  కారణం ఏంటంటే వేణు స్వామి సతీమణి వీణ శ్రీవాణి ముకేశ్ అంబానీ రెండవ కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకకు హాజరైంది. అంతేకాదు ఆమెకు ప్రత్యేకంగా ఆహ్వానం అందించారట.  ప్రధాన కారణం ఆమె వీణ వాయించడంలో మంచి పేరు తెచ్చుకుంది కాబట్టి ఆమె ప్రదర్శన కోసం  స్పెషల్ గా ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది. అయితే వివాహ వేడుకలో ఈమె వీణ ప్రదర్శన హైలెట్  గా నిలిచినట్లు సమాచారం.

ప్రపంచంలోని ఎంతోమంది ప్రముఖులు హాజరైన వివాహ వేడుకలో చాలామంది ఈమె వీణ వాయిస్తుంటే కన్నర్పకుండ తిలకించారట. ఆమె పెర్ఫామెన్స్ ను చాలా మంది మెచ్చుకున్నారట.  ఈ విధంగా అనంత్ అంబానీ పెళ్లిలోనే వీణ శ్రీవాణి స్పెషల్ పెర్ఫార్మర్ గా నిలవడంతో  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.  దీంతో చాలామంది వేణు స్వామికి దొరకని అదృష్టం వీణ శ్రీవాణికి దొరకడం  ఆమె చేసుకున్నటువంటి పుణ్యమని అంటున్నారు.

అంతే కాదు ఆమెను చూసి వేణు స్వామి నేర్చుకోవాలంటూ మరో రకంగా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఈ వివాహ వేడుకలో ఆమె పర్ఫామెన్స్ చేసే సమయంలో   తెలుగుదనం ఉట్టిపడేలా డ్రెస్సు కాస్ట్యూమ్స్, నీతా అంబానీ సెలెక్ట్ చేసి మరి ఇచ్చిందట.  దీంతో ఆమె తన వీణ ప్రదర్శన అద్భుతంగా ఇచ్చిందని తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu venuswamy ananth-ambani mukesh-ambani veena-srivani radhika-merchant

Related Articles