ఈ రోజు తమిళులు మన ఉగాది పచ్చడిలానే " వెప్పం పూ రసం" తయారుచేసుకొని తాగుతారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలుగు సంవత్సరాదిగా పిలుచుకునే ఉగాది రోజు చేసుకునే పచ్చడి సౌత్ ఇండియా మొత్తం ఫేమస్. తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు వంటి షడ్రుచుల సమ్మేళనంతో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటుంటారు తెలుగువారు. ఉగాదిని "పుదు వరుష పిరప్పు" అని పిలుస్తారు. ఈ రోజు తమిళులు మన ఉగాది పచ్చడిలానే " వెప్పం పూ రసం" తయారుచేసుకొని తాగుతారు.
ఒక కప్పు - చింతపండు రసం
ఒక కప్పు - కందిపప్పు
రెండు పెద్ద చెంచాలు - వేప పువ్వు
రెండు చెంచాలు - బెల్లం
కొద్దిగా - కొత్తిమీర
అర చెంచా - పసుపు
అర చెంచా - ఆవాలు
రెండు పెద్ద చెంచాలు - నెయ్యి
రుచికి తగినంత - ఉప్పు
రెండు చెంచాలు - ఆయిల్
మూడు - ఎండుమిర్చి
చిటికెడు - ఇంగువ
ఐదు రెమ్మలు - కరివేపాకు
రెసిపీ ..
ఈ రెసిపీ కోసం కొన్ని వేప కొమ్మల నుంచి రెండు పెద్ద చెంచాల పరిమాణంలో తాజా వేపపువ్వును తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న వేప పువ్వును వేసుకొని చిన్న ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేడి చేసి తడఖా వేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకొని, పసుపు, బెల్లం తురుము వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలపాలి. అది ఉడించుకున్నాక ..ఉప్పు వేసి చివర్లో సరిపడా వేయించి పక్కన పెట్టుకున్న వేప పువ్వును వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్ వేపపువ్వును వేసుకొని కలుపుకోవాలి. వేప పూ రసం బాగా మరిగిన తర్వాత ఇంకా మంచి ప్లేవర్ దిగుతుంది. అప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది.