Vijay-Rashmika: పెళ్లికి రెడీ అయిన విజయ్ రష్మిక.. ఎంగేజ్మెంట్ అప్పుడే..?

విజయ్ దేవరకొండ,రష్మిక మందన్నా వీరిద్దరూ టాలీవుడ్ లవ్ బర్డ్స్.. ప్రస్తుతం ఈ జంట పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది. మరి విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ల పెళ్లి ఎప్పుడు.. ఈ సంవత్సరం ఉండబోతుందా అనేది ఇప్పుడు చూద్దాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల కాంబినేషన్లో  డియర్ కామ్రేడ్,గీతగోవిందం వంటి సినిమాలు వచ్చాయి. ఇక అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడి ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.ఈ ఏడాది ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాలు వచ్చే నెల అంటే ఆగస్టు రెండో వారంలో  ఎంగేజ్మెంట్ చేసుకొని నవంబర్లో పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే ఆగస్టు రెండో వారంలో ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకొని అదే రోజు ఇంట్లో కొద్ది మంది సన్నిహితుల మధ్యలోనే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యారట.అలాగే పెళ్లిని గ్రాండ్గా విదేశాల్లో చేసుకోవాలని చూస్తున్నారట.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-16/1721127211_vijayrashmika.jpg

న్యూస్ లైన్ డెస్క్: విజయ్ దేవరకొండ,రష్మిక మందన్నా వీరిద్దరూ టాలీవుడ్ లవ్ బర్డ్స్.. అయితే వీరిద్దరి మధ్య గీత గోవిందం సినిమా టైం నుండే ప్రేమాయణం నడుస్తుంది. కానీ తమ మధ్య ఏదీ లేదన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ వీరిద్దరూ ఇప్పడికే ఎన్నో వేకెషన్స్ కు తిరుగుతూ దానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసి మీడియా ముందు అడ్డంగా దొరికిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయినప్పటికీ దీనిపై ఎక్కడ కూడా నోరు విప్పరు. అయితే ప్రస్తుతం ఈ జంట పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది. మరి విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ల పెళ్లి ఎప్పుడు.. ఈ సంవత్సరం ఉండబోతుందా అనేది ఇప్పుడు చూద్దాం.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల కాంబినేషన్లో  డియర్ కామ్రేడ్,గీతగోవిందం వంటి సినిమాలు వచ్చాయి. ఇక అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడి ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.అలాగే అప్పుడప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ఫంక్షన్లకు,పండగలకు రష్మిక వస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా మనం ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో చూసాం. అయితే ఈ ఏడాది ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాలు వచ్చే నెల అంటే ఆగస్టు రెండో వారంలో  ఎంగేజ్మెంట్ చేసుకొని నవంబర్లో పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారట.

ఇప్పటికే ఆగస్టు రెండో వారంలో ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకొని అదే రోజు ఇంట్లో కొద్ది మంది సన్నిహితుల మధ్యలోనే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యారట.అలాగే పెళ్లిని గ్రాండ్గా విదేశాల్లో చేసుకోవాలని చూస్తున్నారట. అయితే చాలా రోజుల నుండి వీరి మధ్య ప్రేమాయణం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.దీంతో  ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టడంతో విజయ్ రష్మిక లు పెళ్ళికి రెడీ అయినట్టు తెలుస్తోంది.

అయితే విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే రష్మిక మందన్నా లైఫ్ బాగుండదని,ఆమె సినీ కెరీర్ పై దెబ్బ పడుతుంది అని వేణు స్వామి స్వయంగా రష్మికకు చెప్పినప్పటికీ ఆమె వినట్లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం రష్మిక సినీ కెరియర్ చాలా బాగుంది. మరి నిజంగానే విజయ్ దేవరకొండ రష్మిక ల పెళ్లి అయితే ఆమె సినీ కెరియర్ పై ఏదైనా దెబ్బ పడుతుందా అనేది చూడాలి. ఇక ప్రస్తుతం రష్మిక పుష్ప 2 , రెయిన్ బో వంటి సినిమాల్లో చేస్తోంది. ఇక విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu vijay-deverakonda pushpa2 rashmika-mandanna engagement gautham-thinnanuri

Related Articles