వారితో పాటు పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. ఇటీవల ఈ ఇద్దరు రెజ్లర్లు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే.
న్యూస్ లైన్ డెస్క్: హర్యానాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక అపరిణామం చోటు చేసుకుంది. రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గే వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. ఇటీవల ఈ ఇద్దరు రెజ్లర్లు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే.
దీంతో ఈ ఇద్దరు రెజ్లర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు, రైల్వేలో తన ఉద్యోగానికి వినేశ్ ఫొగాట్ రాజీనామా చేశారు. ఆమె కాంగ్రెస్లో చేరనున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ పోస్ట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, వినేష్ ఫోగట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.