bigboss: మరో మూడు రోజులే ...టైటిల్ గెలిచేది ఎవరు !

మిగతా కంటెస్టెంట్స్ ని ఆడియన్స్ ఓట్లు వేసి టైటిల్ రేసులో నిలిపారు. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. చాలా మంది నిఖిల్ అని మరికొంతమంది గౌతమ్ అని వాదిస్తున్నారు.  


Published Dec 11, 2024 06:02:00 PM
postImages/2024-12-11/1733920572_imgonlinecomuatwotoonej5hvkgsexvvcsk.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  నిఖిల్, అవినాష్, ప్రేరణ, నబీల్, గౌతమ్ ఫైనల్ లిస్ట్ లో ఉన్నవారు. ఈ వారం తో బిగ్ బాస్ కథ ముగుస్తుంది. పోటాపోటీగా ఓట్లు పడుతున్నాయి. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి నేరుగా తన బెర్త్ టాప్ 5 లో కన్ఫర్మ్ చేసుకున్నారు. మిగతా కంటెస్టెంట్స్ ని ఆడియన్స్ ఓట్లు వేసి టైటిల్ రేసులో నిలిపారు. వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. చాలా మంది నిఖిల్ అని మరికొంతమంది గౌతమ్ అని వాదిస్తున్నారు.  


ఇకమూడు వారాలుగా ఇద్దరు కంటెస్టెంట్స్ పేరు టైటిల్ రేసులో వినిపిస్తున్నాయి. నిఖిల్, గౌతమ్ లలో ఒకరు టైటిల్ విన్నర్ అంటున్నారు. నిఖిల్ ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉన్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్. టాస్క్ లలో సత్తా చాటాడు. నిఖిల్ దే టైటిల్ అంటున్నారు.   మరికొంతమంది గౌతమ్ పీఆర్ టీం తో ఓట్లు వేయిస్తున్నాడనే వాదన కూడా ఉంది. ఎంత వరకు నిజమో తెలీదు కాని ఓటింగ్ మాత్రం చాలా పోటా పోటీగా జరుగుతుంది.నిఖిల్ నాన్ లోకల్ అనేది అతనికి మైనస్. కాని సత్తా చాటడానికి తెలుగు కన్నడ ఏంటి...అతను తన కష్టం తో ఆడి గెలుస్తున్నాడనేది నిజం . గౌతమ్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ మైనస్. దాదాపు 4 వారాలు తర్వాత ంట్లోకి ఎంటర్ అయ్యాడు .ఇది గౌతమ్ కి మైనస్ అవుతుంది. ఇక ప్రేక్షకులు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.  


ఇక మూడవ స్థానంలో ప్రేరణ, నాలుగో స్థానంలో నబీల్ ఉన్నాడట. ఐదవ స్థానంలో అవినాష్ కొనసాగుతున్నాడట. ఓటింగ్ లో అవినాష్ భారీగా వెనుకబడ్డాడని సమాచారం. మిగతా నలుగురితో పోల్చుకుంటే అవినాష్ కి అత్యల్పంగా ఓటింగ్ నమోదు అవుతుందట. 


కాగా లేటెస్ట్ సీజన్లో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకోనుందట. కేవలం 4 గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఫైనల్ కి వెళతారట. టాప్ 5 కన్ఫర్మ్ అయ్యారు కదా.. నలుగురు ఫైనల్ కి వెళ్లడం ఏమిటని మీకు సందేహం రావచ్చు.  టైటిల్ కొడతామనే నమ్మకం లేని వాళ్లు ... డబ్బు తీసుకొని బయటకు వచ్చేయొచ్చు. వాళ్లు టాప్ 5 లో ఉన్న ఎవ్వరైనా . అయితే డబ్బు తీసుకోకపోతే ...మీ ఆర్డర్ ప్రకారం మీరు గెలవచ్చు..లేకపోతే ఓడిపోవచ్చు. ఓన్ రిస్క్  అన్నమాట...జస్ట్ మూడో రోజుల్లో బిగ్ బాస్ 8 కి తెర పడుతుంది. గెలుపు ఎవరిదో చూడాలి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu big-boos8 final elimination

Related Articles