సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల కళా ప్రపంచం. ఈ ప్రపంచంలో నటనే ప్రథమ ధ్యేయంగా బతుకుతూ ఉంటారు. కెమెరా ముందు ఎలా నటించినా, కెమెరా బయటకు వచ్చిన తర్వాత ఎవరి సొంత లైఫ్ ప్రకారం వారు జీవిస్తారు. కానీ ప్రస్తుత కాలంలో కెమెరా ముందు చేసినటువంటి కొన్ని పాత్రలను బట్టి కొంతమంది ఆకతాయిలు వార్తల క్రియేట్ చేసి వారి సొంత లైఫ్ ను డిస్టర్బ్ చేస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల కళా ప్రపంచం. ఈ ప్రపంచంలో నటనే ప్రథమ ధ్యేయంగా బతుకుతూ ఉంటారు. కెమెరా ముందు ఎలా నటించినా, కెమెరా బయటకు వచ్చిన తర్వాత ఎవరి సొంత లైఫ్ ప్రకారం వారు జీవిస్తారు. కానీ ప్రస్తుత కాలంలో కెమెరా ముందు చేసినటువంటి కొన్ని పాత్రలను బట్టి కొంతమంది ఆకతాయిలు వార్తల క్రియేట్ చేసి వారి సొంత లైఫ్ ను డిస్టర్బ్ చేస్తున్నారు.
అలాంటి ఈ రోజుల్లో కొంతమంది హీరోయిన్లు ఒకే హీరోతో తల్లిగా, ఫ్రెండ్ గా, లవర్ గా, భార్యగా ఇలా అన్ని కోణాల్లో నటిస్తున్నారు. అలా ఈతరం హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. ఈమె కేవలం నాగచైతన్యతోనే ఫ్రెండ్ గా, లవర్ గా, తల్లిగా ఇలా అనేక పాత్రల్లో చేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
అయితే ఈ అమ్మడు కింగ్ నాగార్జున హీరోగా వచ్చినటువంటి సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో ఆయనకు భార్యగా నటించింది. ఆ తర్వాత దానికి సీక్వెల్ గా వచ్చిన బంగర్రాజు మూవీలో నాగ్ కొడుకుగా నాగచైతన్య కనిపించారు. ఇందులో వీరిద్దరు స్నేహితులుగా నటించడం జరిగింది. అంతే కాకుండా మనం చిత్రంలో ఆమె చిన్న పాత్రలో కనిపించింది. అంతేకాకుండా ఈ ఇద్దరు యుద్ధం శరణం అనే మూవీలో హీరో హీరోయిన్స్ గా కూడా చేశారు.
ఇలా నాగచైతన్యతో లావణ్య త్రిపాఠి అమ్మగా, ఫ్రెండ్ గా, లవర్ గా అన్ని కోణాల్లో నటించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నాగచైతన్య విషయానికి వస్తే హిట్స్ ప్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన తండేల్ అనే మూవీ ద్వారా మన ముందుకు రాబోతున్నారు.