దివంగత నటుడు చలపతిరావు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, వంటి స్టార్ హీరోలతో ఆయన తెరను పంచుకున్నారు. అలాంటి
న్యూస్ లైన్ డెస్క్:దివంగత నటుడు చలపతిరావు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, వంటి స్టార్ హీరోలతో ఆయన తెరను పంచుకున్నారు. అలాంటి చలపతిరావు తన సొంత లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరికి సూసైడ్ కూడా చేసుకుందామనుకున్నారట. కానీ వాళ్ల కోసం మాత్రమే ఆగిపోయారట. అలాంటి చలపతిరావు సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఆయన జీవిత విశేషాలు ఏంటో చూద్దాం.
ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చలపతిరావు పాల్గొని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలు బయట పెట్టారు. నేను చిత్ర పరిశ్రమంలో అడుగు పెట్టక ముందే ప్రేమ వివాహం చేసుకున్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే నా క్లాస్మేట్ ఒక ఆమెను ప్రేమించాను. కానీ అప్పుడే డైరెక్ట్ గా పెళ్లి చేసుకుందామని కూడా అడిగాను. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో పెళ్లి కాని మా అన్నయ్య మా చెల్లెలు ఉన్నారు.
అలా కొన్నాళ్లపాటు వెయిట్ చేసి చివరికి ఆమెను సీక్రెట్ గా పెళ్లి చేసుకుని లక్ష రూపాయలు తీసుకొని మద్రాస్ వెళ్లిపోయాను. అప్పటికి నాకు వేషాలు రాలేదు. అలా రెండు సంవత్సరాల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అలా సంవత్సరాలు గడిచె కొలది పిల్లలు కూడా పుట్టారు. ఇక ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత నా భార్యచనిపోయింది. అప్పటికి నా వయసు కూడా అంత 27 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చిన్న చిన్నగా వేషాలు వస్తున్న తరుణంలో మూడవ సంతానం కూడా అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు నా భార్య మరణించింది. దీంతో పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కాక అనేక ఇబ్బందులు పడ్డాను.
చూస్తే చాలా చిన్నపిల్లలు. నేను వారిని విడిచిపెట్టి బయటకు వెళ్లలేను. అలా కొన్నాళ్లపాటు ఎన్నో ఇబ్బందులు పడ్డాను ప్రతిరోజు వారు నా పైన పడుకునే వారు. చుట్టుపక్కల వారంతా నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకో ఇంకా నీకు వయసు ఉంది కదా అంటూ చెప్పేవారు. కానీ నేను బలంగా ఫిక్స్ అయ్యాను. నా పిల్లలను నా శక్తి ఉన్నంతవరకు పెంచి ప్రయోజకుల్ని చేయాలనుకున్నాను. పెళ్లి అనే విషయాన్ని పక్కన పెట్టేసాను. ఎలాగైనా మళ్ళీ సినిమాల్లో రాణించాలని వారి భవిష్యత్తు తీర్చిదిద్దాలనుకొని, మా సొంత ఊరుకి వెళ్లి మా అమ్మను అడిగాను.
నాతో మద్రాస్ వస్తావా అక్కడ పిల్లల్ని చూసుకోవాలని అన్నాను. అలా అంటావ్ ఏంట్రా నేను నీ పిల్లల్ని చూసుకుంటాను నువ్వు మరో పెళ్లి చేసుకో అని చెప్పింది. దీంతో అది తర్వాత చూద్దాంలే అమ్మ ముందైతే నాతో రా అని, ఎప్పుడు కూడా ఊరు దాటని మా అమ్మను మద్రాస్ తీసుకొచ్చి పెట్టాను. అలా పిల్లలను అమ్మ చూసుకుంటూ వచ్చింది. ఇక నాకు వేషాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక ప్రతిరోజు రాత్రి అయ్యే వరకు వేషాలు వేసుకొని వచ్చి ఆ తర్వాత పిల్లలతో కాస్త సమయం ఇచ్చి తీరేవాణ్ణి. అలా పిల్లల్ని పెద్ద స్కూల్లో చదివించాను. పెళ్లి అనే విషయాన్ని కనీసం మనసులోకి కూడా రానివ్వలేదు.
చివరికి వారందరిని పెంచి పెద్దవాళ్ళం చేశాను. ప్రస్తుతం నా ఇద్దరు కూతుళ్లు అమెరికాలో బాగా సెట్ అయ్యారు. ఇక నా కొడుకు రవిబాబు డైరెక్టర్ గా, నటుడిగా మంచి పేరు తెచ్చుకొని హ్యాపీగా జీవిస్తున్నాడని చలపతిరావు చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితి నుంచి తన పిల్లల గురించి ఆలోచన చేసి చివరికి జీవితంలో ముందుకు వెళ్లాలని చలపతిరావు అన్నారు. నన్ను ఆరోజు ఆత్మహత్య నుంచి కాపాడింది నా పిల్లలే అని చెప్పుకొచ్చారు.