Nani: నాని రౌడీ హీరోకు అన్నవుతాడా..వీరి మధ్య బంధం ఇదేనా.?

 తెలుగు ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నాని అంటే  ఎలాంటి గుర్తింపు ఉంటుందో మనందరికీ తెలుసు. ఈయన ఏ చిత్రంలో చేసిన చాలా న్యాచురల్ గా నటిస్తూ అద్భుతమైన కథ ఉన్న సినిమానే ఓకే చేస్తారు.  అలాంటి న్యాచురల్ 


Published Sep 15, 2024 04:17:53 PM
postImages/2024-09-15/1726397273_nanivijaydeverakonda.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నాని అంటే  ఎలాంటి గుర్తింపు ఉంటుందో మనందరికీ తెలుసు. ఈయన ఏ చిత్రంలో చేసిన చాలా న్యాచురల్ గా నటిస్తూ అద్భుతమైన కథ ఉన్న సినిమానే ఓకే చేస్తారు.  అలాంటి న్యాచురల్ స్టార్ నాని, వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.  అయితే తాజాగా నాని దుబాయ్ లో జరిగినటువంటి సైమా అవార్డు ఫంక్షన్ లో మెరిశారు. అయితే ఈ ఫంక్షన్ లో బేబీ, హాయ్ నాన్న, దసరా సినిమాలకు సంబంధించి వరుసగా అవార్డులు వరించాయి.

దసరా సినిమాలో నాని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. అయితే ఈ అవార్డును విజయ్ దేవరకొండ  నానికి అందించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ నానితో చేసినటువంటి సినిమా గురించి పంచుకొని అద్భుతమైనటువంటి విషయాన్ని బయటపెట్టారు. నానితో వర్క్ చేసినటువంటి ఎవరే సుబ్రహ్మణ్యం షూట్ రోజులను గుర్తు చేసుకున్నారు. విజయ్ దేవరకొండ సినీ కెరియర్ మొదట్లో నాని ఎంతో సహకారం అందించారని  తనకు ఎంతో ధైర్యం చెప్పి అండగా నిలిచారని అన్నారు.

నాని నా సొంత అన్నా అని ఇప్పటినుంచి నానిని అన్నా అని పిలుస్తానని చెప్పుకొచ్చారు. నేను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోనే మొదటిసారి కీలకపాత్ర పోషించానని, ఈ సినిమా ఆడిషన్స్ లో భాగంగానే నేను నాని ఆఫీస్ వెళ్లానని చెప్పుకొచ్చారు. ఏ నటుడి కైనా తొలి చిత్రం అంటే ఎంతో కంగారు ఉంటుంది. కానీ నాని అన్న నాకు ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. అన్నతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.  ఇండస్ట్రీలో నేను ఎందరినో అన్న అని పిలుస్తాను..కానీ ఎందుకు పిలుస్తానో నాకు తెలియదు..

కానీ నాని మాత్రం నాకు రియల్ గా అన్నలాగా ఎంతో ఉపయోగపడ్డాడు ఆయన ఇప్పటినుంచి నా సొంత అన్న కంటే ఎక్కువ అని చెప్పుకొచ్చారు.  ఈ సందర్భంగా దసరా సినిమాకు ఉత్తమ యాక్టర్ గా నాని అవార్డును విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అందించాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఇదే స్టేజిపై వచ్చే ఏడాది నేను విజయ్ దేవరకొండకు కూడా అవార్డు ఇస్తానని విజయ్ దేవరకొండ రాబోవు చిత్రం అద్భుతమైన హిట్ సాధిస్తుందని చెప్పుకొచ్చారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu vijaydevarakonda nani hai-nanna dasara-movie baby

Related Articles