సాధారణంగా పెళ్లి చేసుకునే వారి ఏజ్ లో గ్యాప్ ఉండడం సర్వసాధారణమే. పూర్వకాలంలో అయితే కనీసం భార్యాభర్తల మధ్య పది సంవత్సరాలు కంటే ఎక్కువ గ్యాప్ ఉండేది. ఇది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత కాలంలో
న్యూస్ లైన్ డెస్క్:సాధారణంగా పెళ్లి చేసుకునే వారి ఏజ్ లో గ్యాప్ ఉండడం సర్వసాధారణమే. పూర్వకాలంలో అయితే కనీసం భార్యాభర్తల మధ్య పది సంవత్సరాలు కంటే ఎక్కువ గ్యాప్ ఉండేది. ఇది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత కాలంలో కొంతమంది ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది వారితో సమానంగా ఏజ్ ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. మరి ఈ అన్ని పెళ్లిల్లోకెల్లా అమ్మాయి కంటే అబ్బాయి ఏజ్ ఎక్కువగా ఉండటం వల్ల బెనిఫిట్స్ ఉంటాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఎక్స్పీరియన్స్:
భార్యాభర్తల మధ్య వయస్సు తేడా వల్ల లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకరికొకరు నేర్చుకోవచ్చట. ముఖ్యంగా భర్త నుంచి భార్య ఎంతో నేర్చుకోవచ్చని చిన్న వయసున్న పార్ట్నర్, ఇష్టా ఇష్టాలు ఇద్దరి మధ్య అనుభవాలు ఒకరికొకరు జ్ఞానాన్ని అందిస్తాయని అంటున్నారు.
కమిట్మెంట్:
అబ్బాయిలు అమ్మాయిలకంటే వయసు ఎక్కువగా ఉండటం వల్ల అమ్మాయి యొక్క అన్ని విషయాలు అర్థం చేసుకుంటారని. ఎక్కువ వయసున్న కపుల్స్ కంటే ఏజ్ గ్యాప్ ఉన్నవారు ఎక్కువగా సంతృప్తి పొంది కమిట్మెంట్ తో ఉంటారని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ గ్యాప్ అనేది తప్పనిసరిగా ఉంటుంది.
ఆనందం:
వయసు కాస్త ఎక్కువగా ఉన్నటువంటి అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంటారట. ఎక్కువ వయసున్న అబ్బాయి ఆల్రెడీ తన జీవితం గురించి అన్ని తెలుసుకొని ఏదో ఒక పనిలో సెట్ అయి ఉంటాడు. దీంతో వారి మధ్య డబ్బుకు కొదువ ఉండదు. అలా జీవితంలో గొడవలు రాకుండా హ్యాపీగా జీవిస్తారు.
లైంగిక ఇబ్బందులు:
వయసు ఎక్కువగా ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే సమస్య లైంగిక సంతృప్తి. ఈ ఒక్క విషయంలో ఏజ్ గ్యాప్ అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. ఇది ఒకటి తప్ప అన్ని విషయాలు అమ్మాయి అబ్బాయితో ఆనందంగా జీవించగలుగుతుంది.