నిజానికి కాళ్లు మరియు పాదాలలో కనిపించే కొన్ని అసాధారణ లక్షణాలు కిడ్నీ సమస్యలకు తొలి సంకేతాలు కావచ్చు. అసలు ఏ ఇబ్బందులు కిడ్నీ సమస్యలకు కారణమవుతాయి,
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఆరోగ్యమే మహాభాగ్యం ఈ విషయం చాలా బాగా అర్ధమవుతుంది. కాని చిన్న చిన్న ఆరోగ్యసమస్యలు వస్తాయి. మనం వెంటనే తేరుకొని డాక్టర్ ను వాడుకుంటే చాలా త్వరగా వ్యాదులు తగ్గుతాయి. నిజానికి కాళ్లు మరియు పాదాలలో కనిపించే కొన్ని అసాధారణ లక్షణాలు కిడ్నీ సమస్యలకు తొలి సంకేతాలు కావచ్చు. అసలు ఏ ఇబ్బందులు కిడ్నీ సమస్యలకు కారణమవుతాయి,
1. మడమల వాపు : చీలమండల చుట్టూ, పాదాలలో, కొన్నిసార్లు ముఖం మరియు చేతులలో కూడా వాపు కనిపించడం కిడ్నీ ప్రాబ్లమ్స్ కు మెయిన్ రీజన్ .శరీరంలో ఎక్సట్రా లిక్విడ్స్ మరియు సోడియంను సరిగ్గా బయటకు పంపలేకపోయినపుడు ఈ లిక్విడ్ తో శరీరంలో నీరు చేరుతుంది. దీని వల్ల కూడా కిడ్నీ ఇబ్బందులు ఉన్నాయని అర్ధం.
2. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేటపుడు రక్తంలో వ్యర్ధపదార్దాలు ఎక్కువవుతాయి. దీని వల్ల స్కిన్ మీద దురదలు , చర్మం పొడి బారుతుంది. సాధారణ చర్మ సమస్యలకు వాడే మందులతో ఈ దురద తగ్గకపోవచ్చు.
3. రాత్రిపూట నిద్రలో ఆకస్మాత్తుగా కాళ్లు , పిక్కలు పట్టేయడం లేదా కండరాలు బిగుసుకుపోతాయి. ఇది కూడా కిడ్నీ సమస్యలకు కారణాలే. తిమ్మిర్లు , చేతులు రావడం లాంటివి ఎక్కువగా ఉంటే మాత్రం వెంటనే కిడ్నీ నిపుణులకు చూపించుకుంటే మంచిది.