జాతీయ రహదారిని దిగ్భంధించడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాకిస్థాన్ లో సింధుజలాల మళ్లింపు రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారాయి . పాకిస్థాన్ లో అందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించడంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరు అందోళనకారులు మరణించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. జాతీయ రహదారిని దిగ్భంధించడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. దీంతో అందోళన కారులు మరింత రెచ్చిపోయారు. మంత్రి ఇంటిని కూడా నిప్పు అంటించడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
లాఠీచార్జికి, కాల్పులకు ఆదేశాలిచ్చారనే అనుమానంతో నౌషేరో ఫిరోజ్ జిల్లాలోని మోరో తాలూకాలో ఉన్న సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లాంజర్ ఇంటిపై ఆందోళనకారులు దాడిచేసి విధ్వంసం సృష్టించారు. ఈ హింసాత్మక సంఘటనల్లో అందోళనకారులు పలు ట్రక్కుల్లో లూటీ చేసి , ఒక ఆయిల్ ట్యాంకర్ తో సహా కనీసం మూడు వాహనాలకు నిప్పుపెట్టారు. యూరియా బస్తాలతో వెళ్తున్న ఓ ట్రక్కు నుంచి బస్తాలను కిందకు విసిరేయగా మరికొందరు వాటిని తీసుకెళ్లారు. పెట్రోల్ పంపు కార్యాలయంపై దాడి చేసి నగదు దోచుకున్నారని పోలీసులపై కర్రలతో దాడి చేశారని స్థానిక మీడియా తెలిపింది.
పంజాబ్ రాష్ట్ర తాగునీటి అవసరాలను తీర్చేందుకు సింధు జలాలను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆరు కెనాల్ లను నిర్మించాలని తలపెట్టింది. సింధ్ జలాలను మళ్లిస్తే తాము తాగు నీటికి చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. తమ పంట పొలాలు బీడువారుతాయని అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం కెనాల్ నిర్మాణంపై వెనక్కి తగ్గకపోవడంతో ప్రజలు ఆందోళనలకు దిగారు.