సాయంత్రం 4 గంటల 17 నిమిషాలకు పతాక స్థాయికి చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు ముగుస్తుంది. దాదాపు 4 గంటల పాటు గ్రహణం ఉంటుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మరికొన్ని రోజుల్లో సూర్యగ్రహణం రాబోతుంది. అటు సైన్స్ పరంగా ,ఇటు జ్యోతిష్యంలో సూర్యగ్రహణానికి ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు. పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి మన దేశంలో చూడలేరు. మనకు సూర్యకాంతి సాధారణంగానే పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల 17 నిమిషాలకు పతాక స్థాయికి చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు ముగుస్తుంది. దాదాపు 4 గంటల పాటు గ్రహణం ఉంటుంది.
అయితే నాసా ప్రకారం ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. ఆర్కిటిక్ , ఉత్తర అమెరికా , దక్షిణ అమెరికా , ఆఫ్రికా , యూరప్ , ఆసియాలోని కొన్ని దేశాల్లో మాత్రం సూర్యగ్రహణం కనిపిస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణానాన్ని నేరుగా చూడకూడదు.అలా చేస్తే రెటీనా దెబ్బతిని కంటి చూపు పోయే ప్రమాదం ఉంది.స్మోక్డ్ గ్లాస్ లేదా సాధారణ సన్ గ్లాసెస్ వంటి ఇంట్లో తయారు చేసినవి కూడా సరిపోతాయి. 2025లో రెండు సూర్యగ్రహణాలు సంభవిస్తాయని నాసా అంచనా వేసింది. మొదటిది మార్చి 29 న ఏర్పడనుంది. రెండోది సెప్టెంబర్ 21న సంభవించే అవకాశం ఉందంది.