china: చైనా కొత్త వైరస్ పై భారత్ ఆదేశాలు !

దీంతో ఈ వైరస్ వ్యాప్తి పై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ కు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.


Published Jan 03, 2025 08:35:00 PM
postImages/2025-01-03/1735916745_SmithAHCC.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: చైనాను వణికిస్తున్న వైరస్ పై భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చైనా లో మరో వైరస్ విజృంభిస్తుందని నేషనల్ మీడియా తెగ వార్తలు వేస్తుంది. ఇక్కడ కూడా చాలా మంది భయాందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం చైనాలో HMPV అనే వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ వైరస్ వల్ల.. వైరస్ బాధిత రోగులతో చైనా ఆస్పత్రులు అన్ని నిండిపోయాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తి పై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ కు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.


శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను నిశితంగా పరిశీలించాలని సూచించింది. ఇది మరో రకం కోవిడ్ గా కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చైనాలో భారీగా జనాలు హాస్సటిల్స్ లో చేరుతున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇతర అనుబంధ ఏజెన్సీల నుంచి డిసెంబర్ 16-22 మధ్య వచ్చిన డేటా ప్రకారం చైనాలో సీజనల్ ఇన్‌ ఫ్లుఎంజా, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్.. హ్యూమన్ మెటాన్యూమోవైరస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ ఫెక్షన్ లు తీవ్రమయ్యాయి అని పేర్కొంది. మళ్లీ మాస్క్ లు పెట్టుకోవడం చాలా ఉత్తమం అని కూడా అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viralfevers fever covid-time china

Related Articles