రీసెంట్ సోషల్ మీడియాలో ఓ వీడియో ఫుల్ వైరల్ అయిపోతుంది. నా బైక్ కి బర్త్ డే ..మీకు కేకు కావాలా అంటూ ప్రతి ఫోన్ కు చక్కర్లు కొడుతుంది ఈ వీడియో.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రోజు రోజుకు పిచ్చిపిచ్చి పీక్స్ కు చేరుతుంది. ఎవరికీ అంటారేమో.. సోషల్ మీడియా వచ్చాక పెద్ద గా పరిచయం లేకుండానే వాళ్ల గురించి వీళ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. రీసెంట్ సోషల్ మీడియాలో ఓ వీడియో ఫుల్ వైరల్ అయిపోతుంది. నా బైక్ కి బర్త్ డే ..మీకు కేకు కావాలా అంటూ ప్రతి ఫోన్ కు చక్కర్లు కొడుతుంది ఈ వీడియో.
ఎవరి పిచ్చి వారికి ఆనందం. మగపిల్లలకి ఇంకేం సరదాలుంటాయి. బైకులు, వాచ్ లు , ఫోన్లు , గర్ల్ ఫ్రెండ్లు, కుక్కలు ఇవవే కదా.. కాని ఇక్కడ మాత్రం.. ఓ వ్యక్తి తన బైక్‌కు బర్త్ డే చేశాడు. పాపం తన బైక్ అంటే ఎంత ఇష్టమో..ఏకంగా బైక్‌తో కేక్ కట్ చేయించాడు. ఆ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్‌గా మారింది. అందుకోసం ఆ వ్యక్తి.. బైక్ నీట్‌గా కడిగి ఓ పూల దండ వేశాడు. ఇంట్లో వాళ్లని.. ఇరుగు పొరుగు వారిని బైక్ బర్త్ డే వేడుకకు పిలిచాడు. ఈ సమయంలో ఓ వ్యక్తి బైక్ ముందు కేక్ పట్టుకోగా.. మరో వ్యక్తి.. ముందు టైర్‌కు కత్తి కట్టి ముందుకు నడిపించాడు. శివమూర్తి3893 అనే ఇన్ స్టా అకౌంట్ నుంచి ఓ రేంజ్లో వ్యూస్ వస్తున్నాయి. అసలు క్రేజీ స్టఫ్.
టైర్ కి కత్తి కట్టడం కాదు..పెట్రోల్ ట్యాంక్ దగ్గర కొవ్వొత్తి వెలిగించండి. కష్టపడి కొనుకున్న బైకు అనుకుంటా అందుకే ఇంత ప్రేమ అంటు మరొకరు కామెంట్లు చేస్తున్నారు.ఇందులో నవ్వడానికి ఏం లేదు” అని మరొకరు వ్యాఖ్యానించారు. “మగవాళ్లు సరిగ్గా ప్రేమించలేరు అని ఆడోళ్లు అంటుంటారు. బైక్ కు హ్యాపీ బర్త్ డే అని కామెంట్లు పెడుతున్నారు.