ఏనుగు సపర్ సింపుల్ గా ఓ హ్యూమన్ ను ఓయ్ పక్కకు తప్పుకో అని సైగలు చెయ్యడం భలే వైరల్ అవుతుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: జంతువులైతేనేం వాటి మాత్రం ఫీలింగ్స్ ఉండవా..ఒక్కొక్కసారి ఫన్నీ గా మరోసారి కోపంగా, మరోసారి ఫుల్ ఆన్ కామన్ సెన్స్ తో ఉంటాయి. అలా ఏనుగు సపర్ సింపుల్ గా ఓ హ్యూమన్ ను ఓయ్ పక్కకు తప్పుకో అని సైగలు చెయ్యడం భలే వైరల్ అవుతుంది.
ఓ వ్యక్తి ఒక ఇంటి ముందు దారిలో నిలబడ్డాడు. అంతలోనే ఓ పెద్ద ఏనుగు వెనుకవైపు నుంచి వచ్చింది. అది చూస్తూ ఆ వ్యక్తి పక్కకు తప్పుకోకుండా అక్కడే నిలబడి ఉన్నాడు. దగ్గరి వరకు వచ్చి ...ఏం చెయ్యకుండా తన కాలితో మట్టిని జస్ట్ గట్టిగా అనడంతో ఆ వ్యక్తి ఏనుగును చూసి పక్కకు తప్పుకున్నాడు. ఏనుగు కనబడటంతో భయపడి ఒక్కసారిగా పరుగు లంకించుకున్నాడు. ఆ ఏనుగు హాయిగా తన దారిన తను వెళ్లిపోయింది.అదే మామూలుగా అయితే తన్ని చితకబాదేస్తుంది. ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.
Elephant gently reminding the human that he is in the way. pic.twitter.com/Ft6P7ICUf8 — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) December 14, 2024