గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెండు తెలుగు రాష్టాల వరద బాధితుల కోసం తన వంతు సాయం ప్రకటించారు.
న్యూస్ లైన్ సినిమా: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ ప్రరిశ్రమ నుంచి హీరోలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెండు తెలుగు రాష్టాల వరద బాధితుల కోసం తన వంతు సాయం ప్రకటించారు. తెలంగాణకు 50 లక్షలు, ఏపీకి 50 లక్షలు చొప్పున విరాళాన్ని అందించారు. ఈ మేరకు రామ్ చరణ్ బుధవారం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని రామ్ పోస్టులో రాసుకోచ్చారు.
వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి… — Ram Charan (@AlwaysRamCharan) September 4, 2024