Jayasudha:64లో మళ్లీ పెళ్లి.. ఆయన బాగా నచ్చాడట.!

ఇండస్ట్రీ వాళ్లకి పెళ్లిళ్లు విడాకులు అంటే చాలా కామన్ అయిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం హీరోలకు ఎక్కువగా విడాకులు అవ్వలేదు కానీ, ఈ తరం హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న


Published Sep 20, 2024 03:08:42 PM
postImages/2024-09-20/1726825122_jaya.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఇండస్ట్రీ వాళ్లకి పెళ్లిళ్లు విడాకులు అంటే చాలా కామన్ అయిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం హీరోలకు ఎక్కువగా విడాకులు అవ్వలేదు కానీ, ఈ తరం హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న తర్వాత కూడా  విడాకులు తీసుకొని వేరే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి జయసుధ  మూడో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే 64 ఏళ్ల వయసు ఉన్న ఈమె పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిందట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

జయసుధ కేవలం నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలుగా కూడా చాలా ఫేమస్. అయితే ప్రముఖ ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ సోదరుడిని గతంలో వివాహం చేసుకుంది. కానీ వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1985లో నటుడు జితేంద్ర బంధువైన నిర్మాత నితిన్ కపూర్ ను రెండవ పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి గుర్తుగా నిహార్, శ్రేయాన్ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ పెద్దవాళ్ళు అయిపోయారు.

 అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇక అప్పటినుంచి ఒంటరిగా జీవిస్తున్నటువంటి  జయసుధ మరో పెళ్లి చేసుకోవాలని భావించిందట. అయితే తాజాగా ఒక విదేశీ వ్యాపారవేత్తను వివాహమాడిందని  వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంతో, అబద్ధం ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి చూడాలి దీనిపై జయసుధ  స్పందించి క్లారిటీ ఇస్తుందా లేదంటే మనకెందుకులే అని సైలెంట్ గా ఉంటుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : news-line sr-ntr marraige jayasudha nithin-kapoor anr sreyan

Related Articles