bhakti: శని ,బుధుల తిరోగమనం ..ఈ రాశి వారికి కలిసి వచ్చే యోగం !

ఈ రెండు శక్తివంతమైన గ్రహాల తిరోగమన ప్రభావం కొన్ని రాశుల వారికి చాలా బాగా కలిసివస్తుంది. ఆ రాశులు ఏంటో చూసేద్దాం. 


Published Jun 16, 2025 12:59:00 PM
postImages/2025-06-16/1750059059_images1.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెల ఎంతో ప్రత్యేకంగా మారనుంది. ఎందుకంటే ఈ నెలలో శని , బుధ గ్రహాలు తిరోగమన దశలోకి ప్రవేశించబోతున్నాయి. శని గ్రహం జూలై 13న మీనరాశిలో తిరోగమనం చేయగా , బుధుడు జూలై 18 న తిరోగమనం ప్రారంభించనున్నాడు. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల తిరోగమన ప్రభావం కొన్ని రాశుల వారికి చాలా బాగా కలిసివస్తుంది. ఆ రాశులు ఏంటో చూసేద్దాం. 


* మకర రాశి: ఈ గ్రహ మార్పుల ప్రభావంతో మకర రాశి వారికి అన్ని రంగాల్లో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు, వ్యాపారాల్లో లాభదాయకమైన ఒప్పందాలు జరగుతాయి. మీ లైఫ్ పార్ట్ నర్ తో చాలా మంచి టైం స్పెండ్ చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడి కుటుంబసభ్యుల మధ్దతు లభిస్తుంది.


వృషభ రాశి: వృషభ రాశి వారికి ఈ రెండు గ్రహాల తిరోగమన ప్రభావం ఆర్థికంగా విశేషంగా సహకరించనుంది. మీరు అనుకున్న టైం కు డబ్బు కుదురుతుంది. మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. విదేశీ ప్రయాణాలు ..మీరు చేసుకున్న ప్లాన్స్ బాగా వర్కవుట్ అవుతాయి.సమాజంలో గౌరవం, పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా ఉన్నాయి. 


తులా రాశి: తులా రాశి వారికి జూలై నెల స్వర్ణావకాశాల నెలగా మారనుంది. శత్రువులపై విజయం సాధించి, కుటుంబ, సామాజిక జీవితంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. మనసుకు హాయిగా శుభవార్తలు వినిపించే సమయం ఇది. ఈ జూలై నెలలో శని , బుధ గ్రహాల తిరోగమనం వల్ల ముఖ్యంగా మకర, వృషభ తులా రాశి వారికి అదృష్టం పడుతుంది. ఆర్ధిక, ఆరోగ్య ,వ్యాపార విజయం శత్రువులపై ఆదిపత్యంపై కొత్త అవకాశాలు కలుగుతాయి. ఇలా అనేక శుభవార్తలతో ముందుకు సాగే అవకాశం ఉంది.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu bhakthi astrology

Related Articles