సినిమా మరో లెవెల్ లో ఉండేదని తెలిపారు. తమిళ సినిమాల్లో ఇంతకు ముందు ఇలాంటి సినిమాటోగ్రఫీ చూడలేదు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సూర్య కంగువ పై సూర్య భార్య షాకింగ్ కామెంట్లు చేశారు. కంగువ సినిమా చూసిన జ్యోతిక నచ్చలేదని డైరక్ట్ గా చెప్పేసింది . “నేను సూర్య భార్యగా కాదు, ఒక సినిమా ప్రేక్షకురాలిగా ఈ పోస్ట్ .తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న సూర్యని చూస్తే చాలా గర్వంగా ఉంది. కంగువా సినిమాలో మొదటి అరగంట సరిగ్గా లేదు, అలాగే సౌండ్ కూడా ఎక్కువగా ఉంది. అదే బాగుంటే సినిమా మరో లెవెల్ లో ఉండేదని తెలిపారు. తమిళ సినిమాల్లో ఇంతకు ముందు ఇలాంటి సినిమాటోగ్రఫీ చూడలేదు. అధ్బుతంగా ఉంది. కాస్త ఎడిటింగ్ మరియు సౌండ్ బాగుండి ఉంటే మరింత బాగుండేదని పోస్ట్ చేశారు.
పాత కథతో, ఆడవాళ్ళని చిన్నచూపు చూపిస్తూ, డబుల్ మీనింగ్ డైలాగులు, ఎక్కువ ఫైట్ సీన్స్ ఉన్న పెద్ద సినిమాలకే ఇలాంటి పరిస్థితి రాలేదు. ఈ సినిమాకు చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. కాస్త ఇబ్బందిగా ఉన్నా ఓ అరగంట సినిమా రివ్యూలన్నీ నెగిటివ్ రావడం ఆశ్చర్యంగా అనిపించింది.
కంగువా సినిమాలో మంచి ఏముందో ఎందుకు చెప్పట్లేదు? రెండో భాగంలో ఆడవాళ్ళ ఫైట్ సీన్, ఆ పిల్లాడికి కంగువా మీద ఉన్న ప్రేమ, కోపం అవన్నీ ఎందుకు చెప్పలేదు. మంచి సీన్స్ ని రివ్యూలో చెప్పడం మర్చిపోయారేమో అనిపిస్తుంది. ఇవన్నీ చదవాలా, వినాలా, నమ్మాలా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. కేవలం సౌండ్ బాలేదు...అరగంట ల్యాగ్ ఉంది ..ఇవే సినిమా ను ఎలా ప్రభావితం చేస్తాయి. అధ్భుతమైన విజువల్స్ ఉన్నాయి. ఇంత నెగటివిటీ పుట్టించడం బాధాకరం. కంగువా టీం మీరు గర్వపడండి.