ఇప్పుడు ల్యాండింగ్ తర్వాత బోల్తా పడడంతో గాయాలతో బయటపడినట్లు నేషనల్ మీడియా కథనాలు వెల్లడించాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కెనడాలోని టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ప్రమాదం జరిగింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి బోల్తా పడడంతో ప్రమాదం స్థాయి తగ్గిందనే చెప్పాలి. గాలిలో కాని లేదా ల్యాండింగ్ టైంలో కాని ప్రమాదం జరిగితే విమానంలో వారంతా చనిపోయే ప్రమాదాలు ఎక్కువ. ఇప్పుడు ల్యాండింగ్ తర్వాత బోల్తా పడడంతో గాయాలతో బయటపడినట్లు నేషనల్ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి గురైన డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం అమెరికాలోని మిన్నెపొలిస్ నుంచి వచ్చినట్లు తెలిపాయి. ప్రమాదానికి గురైన వెంటనే భధ్రత సిబ్బంది అలర్ట్ అయ్యి వెంటనే దగ్గర్లో ఆసుపత్రికి తరలించినట్లు ఎయిర్ పోర్టు వర్గాలు ఎక్స్ వేదికగా వెల్లడించాయి.