circus elephant: స్నేహితుడు చనిపోయాడని ఏనుగు ఎలా ఏడుస్తుందో చూడండి !

ఆ ఇన్సిడెంట్ ను వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తే వైరల్ అవుతుంది. ఏనుగు కంటతడి చూసి నెటిజన్లు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు. 


Published Mar 17, 2025 12:32:00 PM
postImages/2025-03-17/1742195225_4e0ee86902f182807abf8a3cff93930717420498474041163original.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రేమ , ప్రీతి , బంధాలు ..భార్యా ,భర్త, స్నేహితుడు ఇలా మనుషుల్లోనే కాదు..జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి . తనతో పాటు 25 ఏళ్లు జతగా తిరిగిన ఏనుగు చనిపోవడంతో మరో ఏనుగు కంటతడి పెట్టింది. చనిపోయిన ఏనుగును లేపేందుకు విశ్వప్రయత్నం చేసింది. మీదపడి కన్నీరు పెడుతూ దాని దగ్గరకి ఎవరిని రానివ్వలేదు.  రష్యా లోని ఓ సర్కస్ లో ఈ ఘటన జరిగింది. సిబ్బంది ఆ ఇన్సిడెంట్ ను వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తే వైరల్ అవుతుంది. ఏనుగు కంటతడి చూసి నెటిజన్లు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు. 


సర్కస్ లో చాలా ఏళ్లు ఈ రెండు ఏనుగులు కలిసి ..ఎన్నో ఫీట్స్ చేసేవి. ఆ సర్కస్ కు ఆ ఏనుగులు స్పెషల్ అట్రాక్షన్ . సర్కస్ సిబ్బంది వాటికి జెన్నీ, మాగ్డా అని పిలుచుకునేవారు. పాతిక సంవత్సరాలకు పైగా జెన్నీ, మాగ్డా అదే సర్కస్ లో కలిసి ఉన్నాయి. జెన్నీకి అనారోగ్యం తో బాధపడుతుంది. ఇటీవల జెన్నీ మరణించింది. కాసేపటికి జెన్నీ దగ్గరికి వచ్చిన మాగ్డా.. తన తొండంతో జెన్నీని లేపేందుకు ప్రయత్నించింది. జెన్నీ కదలకపోవడంతో మీదపడి కన్నీరు పెట్టుకుంది. చాలా సేపటి వరకు తన స్నేహితుని దగ్గరే కూర్చొని ఏడుస్తూ ఎవ్వరిని దగ్గరకు రానివ్వలేదు. జెన్నీ డెడ్ బాడీ చుట్టూ తిరుగుతూ, కన్నీరు కారుస్తూ తనను పైకి లేపేందుకు మాగ్డా చేసిన ప్రయత్నాలు చూసి సర్కస్ సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-video elephant died

Related Articles