చుట్టుప్రక్కన ఉన్నవారు కోతికి ఏమైనా తినడానికి ఇస్తే వదిలేస్తుందని చెప్పడంతో దానికి ఓ ప్యాకెట్ ను విసిరాడు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కోతి చేష్టలు అని ఊరికే అంటారా ...ఏ దేవాలయానికి వెళ్లండి ఈ కోతుల హడావిడి దారుణంగా ఉంటుంది. చేతిలో ఏం కనిపిస్తే అవి లాక్కొని చాలా ఏడిపిస్తాయి. ఇలా నే ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో ఓ సంఘటన ఫుల్ వైరల్ అవుతుంది. శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ను లాగేసుకున్న కోతి గోడెక్కి కూర్చుంది. ఈ ఫోన్ ధర రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. చేతిలో ఫోన్ కోతి లాక్కోగానే ...ఫోన్ ఓనర్ గుండె జారి పోయి ఉంటుంది. కాసేపు అయిన తర్వాత చుట్టుప్రక్కన ఉన్నవారు కోతికి ఏమైనా తినడానికి ఇస్తే వదిలేస్తుందని చెప్పడంతో దానికి ఓ ప్యాకెట్ ను విసిరాడు. వెంటనే ప్యాకెట్ ను పట్టుకొని ఫోన్ ను కిందకి విసిరేసింది. హోలీ రోజు ఆ హడావిడిలో ఈ సంఘటన జరగడంతో చాలా మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త ఫుల్ వైరల్ అయ్యింది.
Monkey Steals Samsung S25 Ultra in Vrindavan, Returns It For Mango Drink- #Watch #Monkey #SamsungS25Ultra #Vrindavan #ViralVideo pic.twitter.com/BQxqPtviyt — TIMES NOW (@TimesNow) March 17, 2025