కోర్టులో ఛార్జీ షీట్స్ కూడా దాఖలు చేశారు. ఈవెంట్లు పేర్లతో చాలా ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెపై లైంగిక వేధింపులు చేశారన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. దీనిపై కోర్టులో ఛార్జీ షీట్స్ కూడా దాఖలు చేశారు. ఈవెంట్లు పేర్లతో చాలా ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెపై లైంగిక వేధింపులు చేశారన్నారు.
తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15వ తేదీన నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీని తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 25న చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసు కారణంగా జానీ మాస్టర్ నేషనల్ అవార్డు కూడా కోల్పోయారు.