Pawan: ఆ మూవీలో పవన్ చిన్న కూతురు.. అందుకే ఇండియా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా తన ఇద్దరు కూతుర్లతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన ఫోటోలు,వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. అలాగే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లకు పుట్టిన ఆధ్యా 


Published Oct 04, 2024 04:19:34 PM
postImages/2024-10-04/1728038974_pawananjana.jpg

న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా తన ఇద్దరు కూతుర్లతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన ఫోటోలు,వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. అలాగే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లకు పుట్టిన ఆధ్యా మాత్రమే సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కువగా కనిపించేది.కానీ పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నోవా కూతురు ఎక్కడ కనిపించలేదు. కానీ తాజాగా తిరుమల కి వెళ్ళిన సమయంలో పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుర్లను వెంటబెట్టుకుని వెళ్లారు.

ఆ సమయంలో ఆధ్యాత్తో పాటు పవన్ కళ్యాణ్ చిన్న కూతురు అంజనా పోలేనా కూడా కనిపించింది.హీరోయిన్ కి మించిన అందంతో పాలమీగడ లాంటి అందంతో మెరిసిపోతున్న అంజనా పోలేనా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి మరి టెంపుల్ లో అడుగు పెట్టింది.అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా మొక్కుతారు అనే విధానాన్ని కూడా పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుర్లకు చేసి చూపించారు.ఇక పవన్ చేసినట్టే తన ఇద్దరు కూతుర్లు కూడా చేశారు.

అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పవన్ కళ్యాణ్ చిన్న కూతురు పోలేనా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటయ్యా అంటే.. పవన్ కళ్యాణ్ చిన్న కూతురు పోలేనా సడన్ గా కనిపించడానికి కారణం ఆ సినిమానే తెలుస్తోంది.ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్న కూతురు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుందని,అందుకే బయటికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక విషయంలోకి వెళ్తే..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్న కూతురు పోలేనా ఓ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. హరిహర వీరమల్లు సినిమాలో ఓ పది నిమిషాల పాటు స్క్రీన్ స్పేస్ ఉండే ఓ పాత్రలో  అంజనా పొలేనాని తీసుకుంటున్నట్టు సమాచారం. అందుకోసమే అంజనా పోలేనా ఇండియాకి వచ్చినట్టు తెలుస్తోంది. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ లో ఎంత నిజం ఉందో చూడాలి

newsline-whatsapp-channel
Tags : news-line pawan-kalyan aadya anna-leznova hari-hara-veeramallu anjana-polena

Related Articles