bigboss8: టైటిల్ ఫేవరేట్ కి ఎలిమినేషన్ తప్పదా !

11వారం కూడా వచ్చేసింది. నామినేషన్ లో ఓట్లు అద్దిరిపోతున్నాయి. పోటాపోటీగా పడుతున్నాయి ఓట్లు. మరో నెల రోజుల్లో సీజన్ అయిపోతుంది. ఇంకా టైటిల్ పై ఓ క్లారిటీ లేదు.


Published Nov 12, 2024 02:20:00 PM
postImages/2024-11-12/1731401477_biggf7b061742e.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఈ సారి ఓటింగ్ కి ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉన్నాయి. టైటిల్ ఫేవరేట్ కాస్త ఎలిమినేట్ అయిపోయేలా ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పదివారాలు మొదలయ్యాయి. 11వారం కూడా వచ్చేసింది. నామినేషన్ లో ఓట్లు అద్దిరిపోతున్నాయి. పోటాపోటీగా పడుతున్నాయి ఓట్లు. మరో నెల రోజుల్లో సీజన్ అయిపోతుంది. ఇంకా టైటిల్ పై ఓ క్లారిటీ లేదు.


గత వారం గంగవ్వ ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఎలిమినేట్ కాకుండానే గంగవ్వ షోకి గుడ్ బై చెప్పింది. వ్యక్తిగత కారణాలతో గంగవ్వ బయటకు వచ్చేశారు. హరితేజ ను జనాలు ఇంటికి పంపేశారు. అయితే ఈ వారం నామినేషన్ ఒకరికి ఒకరు బాగానే పెయింట్ వేసుకున్నారు. అయితే ఈ వారం యష్మి, గౌతమ్, విష్ణుప్రియ, టేస్టీ తేజ, పృథ్వి, అవినాష్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. 


ప్రస్తుతం ఓటింగ్ లో గౌతమ్ కి ఏకంగా 25 శాతం ఓట్లు పోల్ అయ్యాయట. గౌతమ్ తర్వాత రెండో స్థానంలో యష్మి ఉందట. ఆమెకు కూడా 20 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట.  మూడో స్థానంలో పృథ్వి ఉన్నాడట. ఇక నాలుగో స్థానంలో టేస్టీ తేజ ఉన్నాడట.  విష్ణుప్రియ ఈ వారం బిస్కెట్ అయ్యేలా ఉంది. నిజానికి విష్ణుప్రియకు బయట మంచి ఫేమ్ ఉంది. కాని యూజ్ చేసుకోలేదు.


విష్ణుప్రియ ఏ విధంగా తన మార్కు చూపించడం లేదు. టైటిల్ ఫేవరెట్ కాస్తా ఎలిమినేట్ అయ్యే స్థాయికి పడిపోయింది. ఈ వారం ఆమె డేంజర్ జోన్లో ఉంది. ఇంటిని వీడినా ఆశ్చర్యం లేదు. విష్ణుప్రియ గోల్డెన్ ఛాన్స్ కోల్పోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీలకు టైటిల్ కొట్టే ఛాన్స్ ఎలాగూ ఉండదు. ఏ మాత్రం గేమ్ చూపించినా విష్ణుప్రియ టైటిల్ రేసులో ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు.  అవినాష్ కూడా కాస్త డేంజర్ జోన్లోనే ఉన్నాడు. నిజానికి విష్ణుప్రియ తో పాటు అవినాష్ కూడా డేంజర్ లోనే ఉన్నాడు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu prudhvi-raj bigboss8 vishnu-priya elimination

Related Articles