Vennela Kishore: వెన్నెల కిశోర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌' టీజర్ రిలీజ్ ..?

ఈ సినిమా టీజర్ ను మేకర్స్ చాలా క్రియేటివ్ గా రెడీ చేశారు. రైటర్ మోహన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా లో అనన్య నాగళ్ల హీరోయిన్ .


Published Nov 28, 2024 02:11:00 PM
postImages/2024-11-28/1732783357_SrikakulamVjpg442x2604g.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ డిటెక్టివ్ క్యారక్టర్ లో వస్తున్న సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ..చంటబ్బాయ్ తాలుకా అనేది క్యాప్షన్. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ చాలా క్రియేటివ్ గా రెడీ చేశారు. రైటర్ మోహన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా లో అనన్య నాగళ్ల హీరోయిన్ .


శ్రీ‌కాకుళంలో జ‌రిగిన‌ ఓ హ‌త్య‌ కేసులో పోలీసుల‌కు కూడా అంతుచిక్క‌ని ర‌హ‌స్యాల్ని ఓ లోక‌ల్ గూఢ‌చారి ఎలా ఛేదించాడ‌న్న‌దే ఈ మూవీ క‌థ‌. టీజ‌ర్‌లో ఎప్ప‌టిలానే వెన్నెల కిశోర్ త‌న‌దైన కామెడీ, డైలాగ్ డెలివ‌రీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నారు. నిజానికి వెన్నెల కిషోర్ టైమింగ్ సునీల్ టైమింగ్ కు దగ్గరగా ఉంటుంది. జోక్ వేస్తే అలా పేలుతుంది. మంచి కమెడియన్ ...మంచి స్టోరీ ..వెన్నెల కిషోర్ కు ప్లస్ అవుతుంది.


"అవుట్ లుక్ చూసి కాదు సార్‌.. అవుట్ పుట్ చూసి ఇవ్వండి. ఛాన్సిస్తేనే క‌దా చిరంజీవి మ్యాచో మెగాస్టార్ అయ్యారు", "ఈ క్రైమ్‌లో పాత్ర‌ధారి, సూత్ర‌ధారి, క‌ప‌ట‌ధారితో పాటు ఓ మాయ‌దారి కూడా ఉన్నాడు" అనే డైలాగులు టీజ‌ర్‌లో బాగున్నాయి. డిసెంబ‌ర్‌ 25న ఈ మూవీ విడుద‌ల కానుంది. సినిమా టీజర్ చూస్తే మంచి కామెడీ సినిమా అని అర్ధమవుతుంది. ఈ సారి మరి వెన్నెల కిషోర్ కు హీరోగా బ్రేక్ దొరికేటట్లే ఉంది.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news new-movie vennala-kishor

Related Articles