మరో పాము నేను కూడా నీ ప్రేమ కోసమే వచ్చానన్నట్లుగా వాటి మధ్య దూరడం వీడియోలో ఉంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాములు సయ్యాటకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోలో ఒక ఆడపామును రెండు మగపాములు అనుసరిస్తూ రోడ్డుపైకి రావడం ఉంది. ఆ తర్వాత ఆడపామును ఓ మగపాము పెనవేసుకొని సయ్యాటల్లో మునిగింది. పక్కనే ఉన్న మరో పాము నేను కూడా నీ ప్రేమ కోసమే వచ్చానన్నట్లుగా వాటి మధ్య దూరడం వీడియోలో ఉంది.
ఆమూడు పాములు పెనవేసుకొని కొద్దిసేపు రోడ్డు మీదే మైమరిచిపోయాయి. అటుగా వీడియో కొందరు వాటిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా అరుదైన ఘటన పూణే కంటోన్మెంట్ పరిధిలో జరిగింది.
Rare video of Snake charm at Pune Cantt .
![]()
Tags : news-line newslinetelugu viral-news snakes viral-video