BIGBOSS BUZZ : బిగ్ బాస్ బజ్ ప్రోమో వచ్చేసింది..ప్రొమో అద్దిరిందిగా!

కంటెస్టెంట్స్ లిస్ట్ లు ఇలా గాసిప్స్ షికార్లు చేశాయి. అయితే బగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ అని ఒకరు.


Published Aug 27, 2024 10:24:00 PM
postImages/2024-08-27/1724777784_img220240722t160713.48220240711f809ba87961a1067df1256e1cd36ad.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వచ్చేస్తుంది. సెప్టెంబర్ 1 రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే చాలా ప్రొమోలు ..కంటెస్టెంట్స్ లిస్ట్ లు ఇలా గాసిప్స్ షికార్లు చేశాయి. అయితే బగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ అని ఒకరు..శోభాశెట్టి అని మరికొందరు...ఇలా చాలా చెప్పారు. ఎట్టేకేలకు బిగ్ బాస్ హోస్ట్ ని టీమే రివీల్ చేసేసింది. అసలు మనం అనుకున్న వారు కానే కాదు.


బిగ్ బాస్ బజ్ లో హోస్ట్ గా అంబటి అర్జున్ ను ఫైనల్ చేశారు. మిత్రుడు అయినా తప్పుచేస్తే ముఖానే చెప్పేసే వ్యక్తితం అర్జున్ సొంతం. అలాంటి ఒక డేరింగ్ అండ్ డ్యాషింగ్ వ్యక్తిని బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా ఎంపిక చేశారు . 


ఆ ప్రోమోలో.. “టైమ్ బాగుంటే సంతోషం.. టైమ్ బాగోకపోతే సంకోచం. టైమ్ బాగుంటే మనం ఏం చేసినా ఒప్పు.. అలా టైమ్ బాగున్న కొంతమంది బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారు. మరి వాళ్ల టైమ్ బ్యాడ్ అయితే? బిగ్ బాస్ బజ్ లోకి వస్తారు. లోపల మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి.. ఈ సీటు యమ హాటు”డైలాగులతో దుమ్ముదులిపేశాడు. బిగ్ బాస్ ప్రొమో పై నెటిజన్లు కూడా సూపర్ హ్యాపీ. పర్ఫెక్ట్ కటౌట్ అంటున్నారు. మరి ఆ హాట్ సీట్ లో  మొదట ఎవరు కూర్చుంటారో చూడాలి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shivaji ambati-arjun bigboss--buzz-host bigboss8

Related Articles