Platelets: బ్లడ్ లో ప్లేట్ లేట్స్ పెంచే అధ్భుతమైన మెడిసిన్ ఇవే అని తెలుసా !

పోషకాహార లేమి కూడా ఈ సమస్యను మరింతగా పెంచుతోంది. శరీరంలో గాయాలు మానడానికి, రక్తం గడ్డకట్టడానికి ప్లేట్‌ లెట్లు తప్పనిసరి.


Published Dec 23, 2024 08:43:00 PM
postImages/2024-12-23/1734966855_WorriedthattheplateletscounthasdroppedThesearethenaturalwaystoincrease.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: డెంగ్యూ వస్తే కాని మనవాళ్లకి ప్లేట్ లేట్స్ సంగతి అర్ధం కాలేదు. ఇప్పుడు మళ్లీ డెంగ్యూ జ్వరాలు పంజా విసురుతున్నాయి. కాస్త పెద్ద వాళ్లు డెంగ్యూ దాటికి తట్టుకుంటారు. కాని చిన్నారుల్లో డెంగ్యూ ఫీవర్ చాలా డేంజర్. రక్తంలో ప్లేట్‌ లెట్ల సంఖ్య తగ్గిపోయి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. పోషకాహార లేమి కూడా ఈ సమస్యను మరింతగా పెంచుతోంది. శరీరంలో గాయాలు మానడానికి, రక్తం గడ్డకట్టడానికి ప్లేట్‌ లెట్లు తప్పనిసరి. తగిన సంఖ్యలో ప్లేట్‌ లెట్లు లేకుంటే... ప్రాణాలకే ప్రమాదం కూడా. అసలు ఈ ప్లేట్ లెట్స్ కోసం ఏం తినచ్చు.


* డెంగ్యూ పంజా విసిరినప్పుడు... బొప్పాయి ఆకులు, బొప్పాయి పళ్లతో మంచి ప్రయోజనం ఉంటుంది. బొప్పాయిలో అధికంగా ఉండే విటమిన్‌ సి, కొన్ని రకాల ఎంజైమ్‌ లు రక్తంలో ప్లేట్‌ లెట్స్ పెరుగుతాయి.


* దానిమ్మ పండు వరప్రదాయిని అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధిక స్థాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. 


*మన శరీరంలో రక్తం గడ్డకట్టేందుకు ఇది కీలకమైనదని నిపుణులు చెబుతున్నారు. పాలక్ , బ్రొకలీ లాంటివి హెల్ప్ అవుతాయి.


* గోధుమ గడ్డి జ్యూస్‌ ను తరచూ తీసుకుంటుంటే... శరీరంలో హీమోగ్లోబిన్‌ వృద్ధి చెందుతుంది.


* నువ్వుల నూనెతో వంట చేసుకున్నా... రోజూ ఒక స్పూన్‌ నేరుగా తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.


* గుమ్మడి పండ్లలో అధికంగా ఉండే విటమిన్‌ ఏ, కొన్ని ఎంజైములు మన శరీరంలో ప్లేట్‌ లెట్ల ఉత్పత్తికి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాదు బీట్రూట్ , క్యారట్ , పులుపు కలిగిన ఫుడ్స్ ఏం తిన్నా ప్లేట్ లేట్స్ చాలా బాగుంటాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health healthy-food-habits blood

Related Articles