ఎంతో కాలంగా పార్టీకి నమ్మకంగా పని చేసిన వారిని పక్కనపెట్టి తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి బీసీలకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. బీసీ జాబితాలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పేరు వినిపిస్తున్నట్లు సమాచారం.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడికే తెలంగాణ PCC పగ్గాలు అందిచనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో కాలంగా పార్టీకి నమ్మకంగా పని చేసిన వారిని పక్కనపెట్టి తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి బీసీలకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. బీసీ జాబితాలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పేరు వినిపిస్తున్నట్లు సమాచారం.
ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఇతర పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎక్కువ మంది పార్టీ సీనియర్ నేతలు మహేష్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లు చర్చ నడుస్తోంది. ఇక ఢిల్లీ నుంచి కబురు కోసం మహేష్ గౌడ్ ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మధుయాష్కీ అధిష్టానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ PCC పదవిని కూడా తనకే అప్పగిస్తారని నమ్మకంతో ఉన్నారు. కానీ, తీరా చూస్తే కథ అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది.