Suchitra: ఆ డైరెక్టర్ కామానికి ఎంతో మంది హీరోయిన్లు బలి.?

సింగర్ సుచిత్ర అంటే ఎంతో మంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈమె ఎప్పుడు ఎలాంటి బాంబు పేల్చుతుందోనని.. ఇక ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీల బాగోతాలు బయట పెట్టేసింది. అప్పటివరకు ఎంతో గుట్టుగా వారి వ్యవహారం 


Published Sep 22, 2024 04:38:30 PM
postImages/2024-09-22/1727003310_suchitra.jpg

న్యూస్ లైన్ డెస్క్: సింగర్ సుచిత్ర అంటే ఎంతో మంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈమె ఎప్పుడు ఎలాంటి బాంబు పేల్చుతుందోనని.. ఇక ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీల బాగోతాలు బయట పెట్టేసింది. అప్పటివరకు ఎంతో గుట్టుగా వారి వ్యవహారం నడిపించుకుంటున్నారు. కానీ సడన్గా లీక్ చేసిన ఫోటోల ద్వారా ఒక్కసారిగా మీడియాలో దుమారం సృష్టించింది.

అలా ఎంతో మంది సెలబ్రిటీల పరువు బజారుకీడ్చిన సింగర్ సుచిత్ర ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే అలాంటి సుచిత్ర తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ ని టార్గెట్ చేసి మాట్లాడింది. ఇక ఆయన ఎవరో కాదు దర్శకుడు బాలచందర్.. బాలచందర్ అంటే ఎంతో మందికి ఒక గౌరవం.. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు ఇండస్ట్రీలో స్టార్స్ అయ్యారు..

అలా స్టార్ దర్శకుల్లో ఒకరైన బాలచందర్ గురించి సుచిత్ర మాట్లాడుతూ.. బాలచందర్ ఒక కామపిశాచి.. ఆయన ఎంతోమందిని కమిట్మెంట్ అడిగారు. ఆయన ఫామ్ హౌస్ లో ఎంతో మంది హీరోయిన్లతో ఎంజాయ్ చేశారు.నన్ను కూడా ఫామ్ హౌస్ కి పిలిచిన నేను వెళ్లలేదు.. అమ్మాయిలు అంటే కేవలం దానికోసమే అని అనుకుంటారు.ఆయన అమ్మాయిని చూసే చూపు కూడా అలాగే కామంతో చూస్తూ ఉంటారు.

అంతేకాదు ఆయన ఎంతోమంది అమ్మాయిలను అసభ్యంగా టచ్ చేసి వారిని వేధింపులకు గురిచేసాడు. కానీ పెద్ద దర్శకుడు కావడంతో ఎవరూ కూడా నోరు విప్పలేదు.. బతికున్నన్ని రోజులు లస్టీ మ్యాన్ గానే ఉన్నారు.. ఆయన చేసిన పనులు అన్ని ఇన్ని కావు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది సుచిత్ర. మరి సుచిత్ర వ్యాఖ్యలపై బాలచందర్ అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి

newsline-whatsapp-channel
Tags : news-line kollywood director-torcher heroines- singer-suchitra bala-chander

Related Articles