ఏ సినిమా అయినా సరే షూటింగ్ సమయంలో దర్శకులకు నటీనటులకు మధ్య మంచి బాండింగ్ కుదరాలి. ఎవరి గౌరవాన్ని వారు కాపాడుకుంటూ ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటే సినిమా అద్భుతంగా వస్తుంది. కానీ కొంతమంది
న్యూస్ లైన్ డెస్క్: ఏ సినిమా అయినా సరే షూటింగ్ సమయంలో దర్శకులకు నటీనటులకు మధ్య మంచి బాండింగ్ కుదరాలి. ఎవరి గౌరవాన్ని వారు కాపాడుకుంటూ ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటే సినిమా అద్భుతంగా వస్తుంది. కానీ కొంతమంది డైరెక్టర్లు నటీనటులను వేధిస్తూ ఉంటారు. మరి కొంతమంది హీరోలు, డైరెక్టర్లు చెప్పినట్టు కాకుండా వారికి నచ్చినట్టు చేస్తామంటారు. డైరెక్టర్స్, యాక్టర్స్ మధ్య క్రషేస్ వస్తే మాత్రం సినిమా మధ్యలోనే ఖతమైపోతుందని చెప్పవచ్చు. అయితే కొంతమంది డైరెక్టర్లు వారు అనుకున్న విధంగా సినిమా తీయాలని చెప్పేసి ఎంత కష్టమైనా సరే ఆర్టిస్టులతో నటింపజేస్తారు.
వారు అనుకున్న విధంగా సీను వచ్చేవరకు ఎన్నో టేకులు తీసుకుంటారు. అలా షూటింగ్ విషయంలో కాంప్రమైజ్ కానీ డైరెక్టర్లలో బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఒకరు. ఇది ఒక రోజు బొమ్మరిల్లు మూవీ హీరోయిన్ జెనీలియాతో చాలా దారుణంగా ప్రవర్తించారట. ఎవరికీ జెనీలియా ఓపిక లేక షూటింగ్ స్పాట్ వదిలిపెట్టి పారిపోయిందట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. బొమ్మరిల్లు మూవీ అనేది ఆల్ టైం క్లాసిక్ మూవీగా సూపర్ హిట్ అయింది. ఇందులో సిద్ధార్థ్ జెనీలియా జంటగా నటించారు. అయితే బొమ్మరిల్లు సినిమా ఫస్ట్ డే షూటింగ్ సమయంలో భాస్కర్ చుక్కలు చూపించారట.
సిద్ధార్థ్ జెనీలియా మధ్య నైట్ టైంలో ఐస్ క్రీమ్ తినే సన్నివేశం ఉంటుంది. ఈ షూటింగ్ టైమ్ ను రాత్రి 9 గంటలకు పెట్టుకున్నారు. ఇందులో సిద్ధార్థుని జెనీలియా ఐస్ క్రీమ్ తింటావా అంటూ డైలాగ్ చెప్పాలి. కానీ ఆ డైలాగ్ భాస్కర్ అనుకున్నట్లు జెనీలియా చెప్పలేదట. దీంతో ఆయన 35కు పైన టేకులు తీయించి రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు షూటింగ్ స్పాట్ లోనే ఉంచారట. చివరికి ఓపిక నశించి జెనీలియా చిన్న డైలాగ్ కోసం నన్ను ఇంత ఇబ్బంది పెడతావా అంటూ షూటింగ్ స్పాట్ నుంచి వెళ్ళిపోయిందట.
ఇదే సమయంలో జెనీలియా అల్లు అర్జున్ తో హ్యాపీ అనే చిత్రంలో నటిస్తున్నది. షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన విషయం అల్లు అర్జున్ కు తెలియడంతో ఆయన నచ్చజెప్పి అలా చేయకూడదు భాస్కర్ మంచి డైరెక్టర్ మొదటి రోజే ఆయన క్యారెక్టర్ డిసైడ్ చేయకు అని చెప్పారట. అలా పోను పోను భాస్కర్ పై జేనీలియాకు మంచి అభిప్రాయం ఏర్పడింది.అంతేకాదు బొమ్మరిల్లు సినిమా జెనీలియా కెరియర్ ని మార్చేసిందని చెప్పవచ్చు.