ఈ చిత్రంలో విష్ణు కామెడీ టైమింగ్ కు కలక్షన్లు వచ్చాయి. ఢీ మూవీని జూన్ 6 వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా , జెనీలియా హీరోయిన్ గా శ్రీను వైట్ల తెరకెక్కించిన మూవీ " ఢీ " 2007 లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలచింది. ఈ సినిమాలో శ్రీ హరి పాత్ర , బ్రహ్మానందం కామెడీ , సునీల్ ట్రాక్ ఆడియెన్స్ ను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. ఈ చిత్రంలో విష్ణు కామెడీ టైమింగ్ కు కలక్షన్లు వచ్చాయి. ఢీ మూవీని జూన్ 6 వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతితెలిసిందే. ఈ క్రమంలో విష్ణు నుంచి వచ్చిన ఈ కామెడీ బ్లాక్ బాస్టర్ . అయితే ఇప్పుడంతా రీరిలీజ్ నడుస్తుంది. ఈ మూవీ ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్లు ఫిక్స్ అయ్యారు. అసలే ఇప్పుడు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో ఉన్నారు. ఈ మూవీలో సందడి చేసే కంటే ముందే మళ్లీ ఢీ తో మరోసారి అందరిని పలకరించనున్నారు ‘కన్నప్ప’ చిత్రాన్ని జూన్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.