న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ హౌస్ నుంచి మరొక ఎలిమినేషన్ కు ఫుల్ రంగం సిధ్దమవుతుంది. ఓటింగ్ కొన్ని గంటల్లో ముగుస్తుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నారు. ప్రస్తుతం హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో 5 మంది ఫైనల్ కి వెళతారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ వారం ఇద్దరిని తీసేసే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు.
గత వారం అవినాష్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. నబీల్ అతన్ని సేవ్ చేశాడు. నబీల్ నిర్ణయం అవినాష్ కి మేలు చేసింది. ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు. ఇక 12వ వారం నామినేషన్స్ లో మెజారిటీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వీరిలో వెళ్లిపోతే ...యష్మీ కాని పృథ్వీ కాని వెళ్లిపోతారు. ఓటింగ్ కూడా చాలా తక్కువగా కూడా ఉంది.
మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఫస్ట్ ఓటింగ్ లో ప్రేరణ ఉంది. తర్వాత నిఖిల్ మిగిలిన వారున్నారు. ఇక చివరి స్థానంలో పృథ్విరాజ్ ఉన్నాడట. నబీల్, పృథ్వి మధ్య మూడు శాతం ఓట్ల వ్యత్యాసం ఉందట. మరి ఇదే ట్రెండ్ కొనసాగితే పృథ్విరాజ్ ఇంటిని వీడటం ఖాయం. లేని పక్షంలో నబీల్ ఎలిమినేట్ అవుతాడు. అదే జరిగితే అవిక్షన్ షీల్డ్ అవినాష్ కి వాడి అతడు నష్టపోయినట్లు అవుతుంది. ఇక్కడ పృథ్వీ తో పాటు నభీల్ కూడా రిస్క్ లోనే ఉన్నాడు. పొరపాటున నభీల్ అవిక్షన్ పాస్ అవినాష్ కు వాడి తప్పు చేశాడనే అంటున్నారు నభీల్ ఫ్యాన్స్.