Keerthy Suresh: కీర్తిసురేష్ ఇంటికి వచ్చి ఓ వ్యక్తి అలా చేశాడట..వద్దన్న వినకుండా.?

హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ఇండస్ట్రీలో ఎంతో కీర్తిని మూటగట్టుకుంది. అందంలో కానీ, నటనలో కానీ ఏ మాత్రం  తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. అలాంటి కీర్తి సురేష్ గురించి చెప్పుకోవాలంటే అనేక విషయాలు ఉన్నాయి.


Published Aug 05, 2024 09:41:34 AM
postImages/2024-08-05/1722831094_keerthy.jpg

న్యూస్ లైన్ డెస్క్: హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ఇండస్ట్రీలో ఎంతో కీర్తిని మూటగట్టుకుంది. అందంలో కానీ, నటనలో కానీ ఏ మాత్రం  తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. అలాంటి కీర్తి సురేష్ గురించి చెప్పుకోవాలంటే అనేక విషయాలు ఉన్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలోకి "నేనుశైలజ" అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో యువ హీరో రామ్ పోతినేని సరసాన కథానాయికగా చేసింది.  

చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో, ఆ తర్వాత అలనాటి నటి సావిత్రి  బయోగ్రఫీతో తెరకెక్కిన మహానటి చిత్రంలో నటించి  అద్భుతమైన గుర్తింపును పొందింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కు ఎదురులేదు అనే పేరు వచ్చింది. అనేక ఆఫర్లు క్యూ కట్టాయి.  వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కీర్తి సురేష్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాలో, వెన్నెల పాత్ర చేసి అదరహో అనిపించింది.

ఈ పాత్రకు గాను ఆమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీలో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో కొలువైనటువంటి కీర్తి సురేష్ కు  ఒక పెళ్లి ప్రపోజల్ వచ్చిందట. ఆ ప్రపోజల్ విని ఆమె షాక్ అయిపోయానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  ' నన్ను అభిమానించే ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని డైరెక్టుగా చెప్పాడు.

ముందుగా ఆయన మాటలు విని నేను భయపడిపోయాను. కానీ ఆయన నాపై చూపించే ప్రేమ అభిమానాన్ని చూసి  బాగా నచ్చాడు.  సినీ తారలుగా మమ్మల్ని వారు ఎంతగా అభిమానిస్తారో నాకు అప్పుడే అర్థమైంది. అలాంటి  అభిమానులను చూస్తే మేము ఎంత కష్టపడినా పరవాలేదు అనిపిస్తుందనీ చెప్పుకొచ్చింది. ఆమె మాటలు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu filmfareawards keerthysuresh dasara-movie keerthy-suresh-fan

Related Articles