2032 డిసెంబర్ లో ఈ భూమికి ముప్పుతప్పందంటున్నారు. 300 ఫీట్లవ్యాసార్ధంతో ఉన్న గ్రహశకం చాలా వేగంగా భూమిని డీకొట్టేందుకు వస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : 2032 లో భూమి అంతం కాబోతుందా అంటే చిన్న ఛాన్స్ ఉందని నాసా అంటుంది. ఓ భారీ గ్రహశకలం భూమి ని ఢీ కొట్టేందుకు వాయువేగంతో దూసుకొస్తుందని వెల్లడించింది. ఆ గ్రహశకలం ఎప్పుడు వచ్చేది కూడా డేట్ తో సహా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
2032 డిసెంబర్ లో ఈ భూమికి ముప్పుతప్పందంటున్నారు. 300 ఫీట్లవ్యాసార్ధంతో ఉన్న గ్రహశకం చాలా వేగంగా భూమిని డీకొట్టేందుకు వస్తుంది. అయితే అది భూమి ఢీ కొనే అవకాశం చాలా తక్కువని పేర్కొంది. 2024 YR4 అని ఆ గ్రహశకలానికి శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. దీన్ని కొన్ని వారాల క్రితమే కనిపెట్టారు. 2032 డిసెంబర్ 22వ తేదీన జరగొచ్చని నాసా అంచనా వేసింది.నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కూడా మార్చి 2025లో ఆ గ్రహశకలాన్ని పరిశీలించి, ఆ గ్రహశకలం పరిమాణాన్ని బాగా అంచనా వేస్తుంది.
గ్రహశకల కక్ష్య గురించి పూర్తి పరిశీలన ముగిశాక దాని సైజు , ప్రభావం ఎంత ఉంటుందని దానిపై స్పష్టమైన అవగాహన వస్తుందని నాసా వెల్లడించింది. నాసా సెంటర్ ఫర్ నియర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ నిర్వహించే గ్రహశకల ప్రమాద జాబితాలోప దీన్ని కూడా చేర్చారు. ఈ గ్రహశకలం భూమిని ఢీ కొనకుండా పక్కకు మళ్లించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారు.