జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ తో పాటు అనేక ఇతర అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇంకా ఇది కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది. చెరుకు రసం రోజు తాగడం వల్ల ఆకలి పుడుతుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రకృతి ప్రతిది అధ్భుతమైన ప్రయోజనాలతో మనకు ఇచ్చింది. మనమే వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. నాచురల్ ఫుడ్ పేరుతో లక్షలు పెడుతున్నా ...నేచురల్ ఆర్గానిక్ ఐటమ్స్ దొరకడం లేదు. అయితే అలా నేచురల్ గా దొరికే వాటిలో చెరుకు రసం అధ్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెరకు ఉత్పత్తిలో ఇండియాది రెండవ స్థానం. చెరుకు రసంలో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ తో పాటు అనేక ఇతర అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇంకా ఇది కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది. చెరుకు రసం రోజు తాగడం వల్ల ఆకలి పుడుతుంది.
* అలసటగా నీరసంగా అనిపించినప్పుడు చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు.
* చెరుకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా, మేలైన నిగారింపు సంతరించుకుంటుంది.ముఖంపై ఏర్పడే మొటిమలు తగ్గుతాయి.
* చెరుకు రసం తాగడం వలన వీర్యకణాల నాణ్యత పెరగడంతోపాటు సంతానోత్పత్తి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి.
* బాలింతలు చెరుకు రసం తాగడం వలన వాళ్లలో పాల ఉత్పత్తి అధికం అవుతుంది.
* చెరకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కొత్త కణాలకు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది.
* చెరకు రసం నోటి దుర్వాసన సమస్యను కంట్రోల్ చేస్తుంది.
* చెరకు రసం క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.
వచ్చేదంతా ఎండాకాలమే ...కూల్ డ్రింక్స్ కు నో చెప్పి ..చెరుకురసం , లెమన్ వాటర్ ఇలా నేచురల్ డ్రింక్స్ తాగండి. పిల్లలకు ఇవ్వండి.